Saturday 11 April 2015

12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన

12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన

Sakshi | Updated: April 10, 2015 19:37 (IST)
12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట తనతో సహా మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, పలువురు ఉన్నతాధికారులు వెళతామని పరకాల తెలిపారు. చైనా ఆర్థిక రాజధాని షాంగై తోపాటు బీజింగ్, చింగ్డో నగరాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. 

ఈనెల 12 చైనా వెళ్లనున్న సీఎం చంద్రబాబు
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగనున్న పర్యటన (10-Apr-2015)

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని శనివారం రాత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట మంత్రులు, యనమల, నారాయణ, పరకాల ప్రభాకర్‌, పలువురు ఉన్నతాధికారులు చైనాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా చైనాలోని బీజింగ్‌, షాంగై, చెంగ్లో నగరాల్లో పర్యటిస్తారు. ఏపీలో పెట్టుబడుల కోసం అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు అధికారులు చైనా భాషలో డాక్యుమెంటరీ రూపొందించారు.

సీఎం చంద్రబాబు చైనా పర్యటన షెడ్యూల్‌..

ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు సినిమో ఇంజినీరింగ్‌, ఎల్‌ఎన్‌వీటీ ఇండియా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. 13న ఉదయం 8.30కి జియోమి, ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో సమావేశమవుతారు. అటుతరువాత ఉదయం 9.30కి సినోమాక్‌, షెంజాన్‌ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు సీమెన్స్‌, 11.15కి సుమెక్‌ గ్రూప్‌తో సమావేశంకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. తరువాత సాయంత్రం 4 గంటలకు చైనా వైఎస్‌ ప్రీమియర్‌ ఈవాంగ్‌తో సీఎం సమావేశమవుతారు. 6 గంటలకు బీజింగ్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను సందర్శిస్తారు. 6.30కి చైనాలోని భారత జర్నలిస్టులతో చంద్రబాబు సమావేశమవుతారు. అటుతరువాత 14వ తేదీని ఉదయం 8 గంటలకు చైనా హార్బర్‌ ఇంజినీరింగ్‌ ప్రతినిధులతో భేటీ అవుతారు.

No comments:

Post a Comment