Sunday 19 April 2015

కార్పొరేట్‌ సంస్థలు విరాళాలిస్తే తప్పేంటి?

కార్పొరేట్‌ సంస్థలు విరాళాలిస్తే తప్పేంటి?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌19: కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌, బీజేపీలు సమర్థించాయి. ఎన్నికల సంస్కరణలపై ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో మార్చి 30న జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు కార్పొరేట్‌ విరాళాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
స్థాపించిన మూడేళ్ల తర్వాత ఏ పారిశ్రామిక సంస్థ అయినా తన వార్షిక లాభాల్లో గరిష్ఠంగా 7.5 శాతం మొత్తాన్ని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చంటోన్న ప్రస్తుత నిబంధనను కొనసాగించాలని ఈ రెండు పార్టీలు సూచించాయి. అయితే సమావేశానికి హాజరైన బీఎ్‌సపీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఈ సంస్కృతిని తప్పుబట్టాయి.

No comments:

Post a Comment