Tuesday, 1 April 2014

TDP - Seemandhra Manifesto

సీమాంధ్రకు అద్భుత రాజధాని

Published at: 01-04-2014 08:33 AM
హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి):" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాల్సి ఉంది.నూతన నిర్మాణం జరగాల్సి ఉంది. దీనికోసం పారిశ్రామికాభివృద్ధి త్వరిత గతిన జరగాల్సి ఉంది. ప్రతి జిల్లాలోనూ తగిన కంపెనీలను స్థాపించి పారిశ్రామికాభివృద్ధి చేస్తాం. వికేంద్రీకరణకు కృషి చేసి అన్ని ప్రాంతాలూ అభివృద్ధి పథంలోదూసుకుపోయేలా చేస్తాం. సహజ వనరుల లభ్యతను బట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. అందరికీ అనువుగా ఉండే చోట సర్వ హంగులతో అత్యాధునిక రాజధాని నిర్మిస్తాం''అని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను టీడీపీ సోమవారం విడుదల చేసింది. పోర్టుల నిర్మాణం, పారిశ్రామిక వాడల ఏర్పాటు, కోస్తాలో సహజవాయువు ఆధారంగా విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు తదితర హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరచింది.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
- కళింగపట్నం, నర్సాపురం, నిజాంపట్నం, రామాయపట్నం, దుగ్గరాజుపట్నం సహా ప్రతీ జిల్లాలో ఓ పోర్టు నిర్మాణం. వాటికి అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు.
- పోర్టులను అనుసంధానం చేస్తూ సముద్రతీరం వెంబడి కొత్త రహదారి నిర్మాణం. బకింగ్‌హాం కాల్వ పునరుద్ధరణ. పోర్టులతో అనుసంధానం, జల రవాణా.
- జిల్లాలో పండే పంటల ఆధారంగా మెగా ఫుడ్ పార్కులు.
- ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఉత్తరాంధ్రా పారిశ్రామికాభివృద్ధి.
- ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాయలసీమ జిల్లాల్లో ఫార్మసీ, ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమల ఏర్పాటు. బెంగళూరు-హైదరాబాద్‌తో అనుసంధానంగా కర్నూలు-అనంతపురం ఐటీ కారిడార్ అభివృద్ధి.
- శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వ్యవసాయ, మత్స్య పరిశ్రమ అభివద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఎగుమతులు, ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణం.
- ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలను టెక్స్‌టైల్ పరిశ్రమల కారిడార్‌గా అభివృద్ధి.
- కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సిమెంట్, స్టీల్ పరిశ్రమల అభివృద్ధి.
- కృష్ణా జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా, ప్రకాశం జిల్లాను గ్రానైట్ హబ్‌గా, పశ్చిమ గోదావరి జిల్లాను ఆక్వా కల్చర్ హబ్‌గా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడం.
- అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలను పవన, సౌర విద్యుత్తు హబ్‌లుగా అభివృద్ధి.
- ప్రతీ మండల కేంద్రంలో మౌలిక వసతులు కల్పించి, వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమల కేంద్రాలుగా అభివృద్ది.
- విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రాయాలుగా అభివృద్ధి. కడప, పుట్టపర్తి, రాజమండ్రి విమానాశ్రయాల్లో రాత్రి పూట విమానాలు దిగే సౌకర్యాల కల్పన.
- ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.
- సీమాంధ్రలో అన్ని జిల్లాలను అనుసంధానిస్తూ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటు.
- సింహాచలం, అన్నవరం, విజయవాడ, మంగళగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, లేపాక్షి, మహానంది, ఆహోబిలం, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను కలుపుతూ పిలిగ్రిం కారిడార్.
- యూనివర్సిటీలు, పరిశ్రమలకు అనుబంధంగా ఇన్నోవేషన్ క్టస్టర్ల అభివృద్ధి.
- కోస్తాలోని సహజ వాయువు ఆధారంగా విద్యుత్తు పరిశ్రమలు, ఎల్ అండ్ జి టెర్మినళ్ల ఏర్పాటు.
- అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అన్ని ప్రాంతాల వారికి అనువుగా నూతన రాజధాని నిర్మాణం.
- దేశ, విదేశీ సంస్థలనుంచి పెట్టుబడుల ఆకర్షణకు అనువైన పారిశ్రామిక వాతావరణం కల్పన.
- బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయంపై పోరాటం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా సాధన.
- కాపు కులస్థుల సామాజిక, రాజకీయ, ఆర్ధికాభివృద్ధికి గతంలో విడుదల చేసిన డిక్లరేషన్ అమలుకు కృషి. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేసేందుకు యత్నం.
- విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో ఐటీ అభివృద్ధి.
- చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో హార్టికల్చర్, ఫ్లోరీకల్చర్, పౌల్ట్రీ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు.
- గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి, పొగాకు ఆధారిత పరివ్రమలు, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రిశ్రమల ఏర్పాటు.
- విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్.
-విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో మెట్రో రైలు. గూడూరు, తిరుపతుల్లో కొత్త రైల్వే డివిజన్లు, గుంతకల్లుతో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఏర్పాటు. కర్నూలులో రైల్వే కోచ్ ఏర్పాటుకు కృషి.
- కొల్లేరు, పులికాట్ సరస్సులు, విశాఖపట్నం, హార్స్‌లీ హిల్స్, బొర్రా గుహలు, పాపికొండలు, వివిధ బౌద్ధ క్షేత్రాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధిపరచేందుకు కృషి.

No comments:

Post a Comment