Wednesday, 2 April 2014

People's Manifesto! Sky Baba,

People's Manifesto! Sky Baba, Writer and Convenor, Muslim Intellectual Forum, he had sent email message for manifesto.

1.12% reservations for Mulsims in all sectors

2. Muslim as Deputy CM

3. Political allotment of seats should be on the basis of percentage of population, they should be given where muslims are in majority, one nominated post must be given to them, reservation and allotment is right not as throwing biscuits to them

4. Sachar Committee recommendation says that Muslims are backward than dalits, govt must follow committee recommendations

5. Minority crporations are not taking care of muslim women and children, they should be given proper priority

6. Occupied muslim lands, waqs lands must be taken back and the money generated on that should be spent on for muslim community development

7. Small scale industries, individuals must be supported to grow their industries to big

8. Muslim declaration in budget, transparency in the allotment of budget for Msulims, they should spell how they are spending and where they are spending

9. Survey on Muslim economic and employment status so that they will come to know the vacancies and its easy for allotment

10. Muslim cultural academy must be established as the current cultural academy totally neglected muslims, there should be more translations from hindi/urdu to other languages.

11. Allotment of houses for homeless in urban areas as part of urban development and houses must be constructed for the poor rural families.

12. Loans are not easy for muslims in current banks, there should be special provisions for loans and special banks for Muslims.

13. Health cards to get treatments in corporate hospitals

14. 3 acres land to agricultural labour, fertile land must be given to them, they should get the status of farmers.

SKy Baba, writer & activist

తెలంగాణ ముస్లిం డిక్లరేషన్‌
...............................
తెలంగాణలో మొదటి నుంచి ముస్లింలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజల తరఫున నిలబడి పోరాడిన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రాంతం ముస్లిం రాజుల పాలనలో ఉండడంతో తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి, సాహిత్యానికి, భాషకు ఒక అదనపు సౌందర్యం చేకూరింది. అదే తర్వాతి కాలంలో శాపంగా మారింది. పోలీస్‌ యాక్షన్‌ పేర జరిగిన హైదరాబాద్‌ రాజ్య ఆక్రమణలో ముస్లింలపై ఊచకోత, దోపిడీ కొనసాగింది. ముస్లింలు బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. తర్వాత తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలపడంతో మరింతగా ముస్లింలు వివక్షకు గురయ్యారు. ఆ పరిస్థితి మారి ఇక్కడ అలాయిబలాయి సంస్కృతి (గంగా జమున తెహజీబ్‌) మళ్లీ కళకళలాడాలి. ముస్లింల జీవితాల్లో పూర్వ వైభవం రావాలి. అందుకు రాబోయే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అందుకు ముస్లింల తరఫున కొన్ని డిమాండ్స్‌:

1. ముస్లింలకు అన్నిరంగాల్లో 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి.
2. ఉపముఖ్యమంత్రిగా ముస్లింను ఎంచుకోవాలి.
3. రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తూ సీట్లు కేటాయించాలి. ముస్లింలు అధికంగా ఉండే నియోజక వర్గాలను ముస్లిం రిజర్వ్‌డ్‌ స్థానాలుగా ప్రకటించాలి. ఆలోపు అలాంటి నియోజక వర్గాల్లో అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్ధులనే నిలబెట్టాలి. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్‌ఎల్‌ఎ, ఎంపి సీట్లలో ఏదేని ఒక స్థానంలోనైనా అన్ని పార్టీలు ముస్లింలకు కేటాయించాలి. అన్ని పార్టీలు ఆ స్థానాల్లో ముస్లింలనే అభ్యర్థులుగా నియమించాలి. బిచ్చమేసినట్లుగా కాక హక్కుగా అభివృద్ధిలో భాగంగా దీన్ని చూడాలి.
4. దళితుల కన్నా వెనుకబడి ఉన్నారంటూ ముస్లింల అభివృద్ధి గురించి సచార్‌ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలి.
5. కార్పోరేట్‌ కాలేజీల పేరిట నిధులు కేటాయించడం వల్ల బడాబాబులే లాభ పడుతున్నారు. అందుకు బదులుగా కేజి నుంచి పీజి వరకు ముస్లిం విద్యార్ధుల కొరకు ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ స్కూళ్ళు ఏర్పాటు చేసి నిర్భంద విద్యను అమలు చేయాలి.
- ఉర్దూ తెలంగాణ ద్వితీయభాషగా గుర్తించి, అమలు చేయాలి. ప్రతి హైస్కూల్‌లో ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఉర్దూను ప్రవేశ పెట్టి తప్పనిసరిగా ఒక ఉర్దూ టీచర్‌ను నియమించాలి. అన్ని రంగాల్లో ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండాలి.
- మైనారిటీ కార్పోరేషన్‌ విద్యమీద కూడా దృష్టి పెట్టాలి. వుమెన్‌ ఎండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ముస్లిం ఆడపిల్లల చదువు మీద దృష్టి పెట్టడం లేదు. వారి నిర్భంధ విద్యకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
6. వక్ఫ్‌ ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు ఖబ్జాలకు గురైన వాటిని వెనక్కి తీసుకొని వాటిమీద వచ్చే ఆదాయాన్ని ముస్లింల అభివృద్ధికి కేటాయించాలి.
7. చిన్న సన్నకారు ముస్లిం పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించి బడా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పించాలి.
8. ముస్లిం ఎకనామికల్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే జరగాలి. ముస్లిం స్టేటస్‌ ఏమిటి అని తెలవడం ద్వారా అన్ని స్థాయిలలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారో తెలవడం ద్వారా ఆయా ఖాళీల్లో ముస్లింలు భర్తీ అయ్యేలా చూడాలి.
9. బడ్జెట్‌ కేటాయింపులో ముస్లిం డిక్లరేషన్‌ ప్రకటించాలి. ముస్లింలకు ఎంత బడ్జెట్‌ కేటాయించారో స్పష్టత ఇవ్వాలి. దానిని ఎలా, దేనికి ఖర్చు చేస్తున్నారన్న విషయంలో కూడా పారదర్శకత పాటించాలి.
10. ముస్లింలకు సాంస్కృతిక వ్యవహారాలకు ప్రతిసారి జరుగుతున్న అన్యాయాల్ని నివారించడానికి ముస్లింలకు ఒక సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఉండాలి. ప్రస్తుత సాంస్కృతిక శాఖలో ముస్లింలు లేరు. బాధ్యులు ఆ సృహతో ఉండాలి. ముస్లిం కల్చరల్‌ అకాడమి కూడా ఒకటి ప్రత్యేకంగా ఉండాలి. ఉర్దూ నుంచి తెలుగులోకి, తెలుగునుంచి ఉర్దూలోకి అనువాదాలు చేయించాలి.
11. అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఇళ్ళ స్థలం లేని ముస్లింలకు స్థలం కేటాయించాలి.
- ఇళ్ళు లేని గ్రామీణ పేద ముస్లింలకు ఇళ్ళు కట్టివ్వాలి.
12. ముస్లిం చిన్న సన్న వ్యాపారస్థులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. వారికి రుణాలు మంజూరయ్యే అవకాశం కల్పించాలి. ముస్లింల కొరకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాలి.
13. ముస్లింలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులో లేదు. కార్పోరేట్‌ వైద్యం అందుబాటులో ఉండేలా మెడికల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలి.
14. గ్రామీణ వ్యవసాయ ముస్లిం కుటుంబాలకు 3ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలి. వ్యవసాయ కూలీలనుంచి వారు రైతులుగా మారే అవకాశం కల్పించాలి.
-స్కైబాబ
(ఎస్‌.కె.యూసుఫ్‌బాబ)
ముస్లిం కవి, కథా రచయిత, ముస్లిం సామాజిక ఉద్యమకారులు
కన్వీనర్‌, తెలంగాణ ముస్లిం రచయితల వేదిక, ముస్లిం ఇంటలెక్చువల్స్‌ ఫోరమ్‌

No comments:

Post a Comment