Thursday 3 April 2014

ఏ పార్టీకీ చిత్తశుద్ది లేదు :మంద కృష్ణ

ఏ పార్టీకీ చిత్తశుద్ది లేదు :మంద కృష్ణ

Published at: 04-04-2014 06:53 AM

వడ్డెపల్లి, ఏప్రిల్ 3: మేనిఫెస్టోల విషయంలో ఇతర రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎప్‌సీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వరంగల్‌లో పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎంపస్‌సీ రూపొందించిన మేనిఫెస్టో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటిస్తామని చెప్పారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివీ..
8ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పన. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపు. ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన వ్యవస్థ అమలుకు కృషి.
8బీసీలకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్
8రాజేంద్రసింగ్ సచార్, రంగనాథ్‌మిశ్రా కమిషన్ల సిఫారసుల ప్రకారం ముస్లింలకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో 12శాతం రిజర్వేషన్ అమలుకు కృషి.
8అగ్రకుల పేదలకు ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు.. వారి నిష్పత్తికనుగుణంగా బడ్జెట్ కేటాయింపు.
8వికలాంగులకు రూ.1500, వృద్ధులకు రూ.1000, వితంతువులకు రూ.1000పెన్షన్
8చౌకడిపో డీలర్లు, వారి సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.

No comments:

Post a Comment