మోదీ పులి కాదు అసలు పులి బెంగాల్‌లో ఉంది
కోల్‌కతా, ఏప్రిల్ 29: "మోదీ తాను అప్పుడే పీఎంను అయిపోయాననుకుంటున్నారు. ఆయనేమీ పులి కాదు. మాయావతి, జయలలిత, ములాయంజీ.. ఇలా చాలా మంది నాయకులున్నారు. వారంతా పులులే. కానీ, అన్నిటికన్నా భీకరమైన పులి.. రాయల్ బెంగాల్ టైగర్.. అది బెంగాల్‌లో ఉంది''.. అంటూ తృణమూల్ అధినేత్రి తనను తాను రాయల్ బెంగాల్ టైగర్‌గా అభివర్ణించుకుంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని 'గుజరాత్ కసాయి'గా అభివర్ణిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చేసిన విమర్శలకు ఆమె మరింత పదును పెట్టారు. మోదీగనక ప్రధాని అయితే.. భారతదేశం చీకటి యుగాల్లోకి వెళ్లిపోతుందని, దేశం తగలబడిపోతుందని మంగళవారం ఇక్కడ జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు. విభజన రాజకీయాలకు పాల్పడేవారు దేశానికి నాయకత్వం వహించలేరంటూ నిప్పులు చెరిగారు. అల్లర్లకు కారణమైనట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి.. భిన్నభాషలు, భిన్నమతాలున్న భారత్ లాంటి దేశానికి నాయకత్వం వహించకూడదన్నారు.
No comments:
Post a Comment