Thursday, 10 April 2014

రాజకీయాల్లో ఏడుపే జగన్ ఆయుధం!

రాజకీయాల్లో ఏడుపే జగన్  ఆయుధం!

        జగన్ ది చిత్రమైన రాజకీయం. రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు ఏవీ ఆయనకు పట్టవు. చివరకు రాష్ట్ర విభజన కూడా అయనకు పట్టే అంశంకాదు. ఆయనకు పట్టేది ఒక్కటే.  ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి అయిఫోవడం.  చంద్రబాబు, జగన్ పైకి  రాజకీయ ప్రత్యర్ధులుగా కనిపిస్తారుగానీ, అడ్డడారిలో ముఖ్యమంత్రి అయిఫోవా;లనుకోవదంలో ఇద్దరూ ఒక్కటే.

        జగన్ ఇంతకుముందు రాజకీయాల్లో లేరు. తన నాయిన వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయేనాటికి  ఆయన రాజకీయ అనుభవం కేవలం మూడు నెలలు యంపీగా వుండడం మాత్రమే. వైయస్  రాజశేఖరరెడ్డి  ముఖ్యమంత్రిగా వుండగా తాను ఒక్కసారి కూడా సెక్రటేరియట్ కు రాలేదని జగన్ తరచుగా చెపుతుంటారు. రాజు కొడుకు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొరవా అన్నట్టు  జగన్ తలుచుకుంటే అతను  సెక్రటేరియట్ కు వెళ్ళాలా? సెక్రటేరియట్టే అతని దగ్గరకు రాదూఇంగ్లీషులో ముద్దుగా క్విడ్ ప్రో కో  అని పిలుచుకునే పదం ఒకటుంది. దీన్నే "నీకెంత-నాకేంత" మనోళ్ళు తెలుగులో ముచ్చటగా చెప్పుకుంటుంటారు. జగన్ తారక మంత్రం అదొక్కటే.  తనను సిబిఐ ద్వార కాంగ్రెస్ వేధిస్తున్నదని చెప్పి రోజూ జనం ముందు ఏడ్వడమేతప్ప తనకు అన్ని వేల కోట్లో, లక్షల కోట్లో ఎలా వచ్చాయో జగన్ ఎప్పుడూ చెప్పరు. అసలు తన మీద ఏ ఏ కేసులున్నాయో కూడా ఆయన జనానికి చెప్పరు.  తండ్రి పేరు జపిస్తే చాలు జనం మిగిలిన విషయాలు పట్టించుకోరని ఆయన ప్రగాడ నమ్మకం.

        తండ్రి చనిపోతే ఏవరికైనా దిగులు వేస్తుంది. ఏడుపు తన్నుకు వస్తుంది.  ఆ వెలితి చాలా కాలం వుంటుంది. జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒంటరిగా కూర్చొని ఏడ్వాలనిపిస్తుంది. కానీ జగన్ తీరేవేరు. నాయన చనిపోయాడని ఆయన ఐదేళ్ళుగా రోడ్లెక్కి ఏడుస్తున్నారు.  ఈ విషయంలో వారిది ప్రపంచ రికార్డు. గెన్నిస్ పుస్తకంలో ఎక్కించాల్సినంత వింత!

        తండ్రి చనిపోవడం గురించి ఇంతగా బాధపడే జగన్ అసలు వైయస్  చనిపోయినపుడు ఏంచేశారూ? అనే సందేహం  రావడం ఎవరికయినా సహజం. హైదరాబాద్ నుండి తిరుపతి బయలుదేరిన వైయస్ హెలీకాప్టర్ గంటలోపే అదృశ్యమైపోయింది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గాలింపు చర్యలు మొదలెట్టాయి. హెలీకాప్టర్ నల్లమల అడవుల్లో  ఆత్మకూరు సమీపాన కూలిపోయి వుంటుందని తేలిందిగానీ  చీకటి పడడంతో గాలింపుచర్యలు ఆగిపోయాయి. అలా వైయస్ మరణించిన తొలిరోజు గడిచిపోయింది.  జగన్ సంపన్నుడు మాత్రమే కాదు భారీ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల యజమాని. ఎలాంటి వార్త నయినా చిటికెల్లో ఆరా తీయగల వేలాది రిపోర్టర్ల పటిష్టమైన  వ్యవస్థ ఆయన స్వంతం. దాన్ని అప్రమత్తం చేస్తే, వైయస్ హెలీకాప్టర్ మాయమైన కొన్ని గంటల్లోనే దాని ఆచూకి బయటపడి వుండేది. కానీ, జగన్ ఆ పని చేయలేదు. వారు వేరే పనుల్లో తీరికలేకుండా హైదరాబాద్ లో వున్నారు. అప్పుడు వారి బెంగ నాయిన చనిపోయినందుకు కాదు; నాయిన సీట్లో తను కాకుండా ఇంకెవరయినా కూర్చుంటారని!. తండ్రి శవానికి కాపాల కాయాల్సిన సమయంలో  జగన్ తండ్రి కూర్చీకి కాపలా కాస్తూ వుండిపోయారు. వైయస్ చనిపోయిన ఎన్నిగంటల తరువాత   జగన్ ఆయన బౌతిక కాయాన్ని చూశారూవైయస్ చనిపోయిన   పావురాలగుట్టకు జగన్ ఎప్పుడు వెళ్ళారూజగన్ తండ్రి శవం దగ్గరికి పరుగున వెళ్ళారా? లేకపోతే రెండు రోజుల తరువాత వైయస్ శవాన్నీ జగన్ దగ్గరికి తీసుకువచ్చారా? అనే సందేహాలు చాలా మందికి చాలాసార్లు వచ్చివుంటాయి. వైయస్ భౌతిక కాయం హైదరాబ్ లో వుండగానే  జగణ్ ను సియం చేయాలంటూ సంతకాల సేకరణ మొదలైంది.  ఈ సంతకాల సేకరణ కాంగ్రెస్ శాసన సభ్యులకే పరిమితం కాలేదు. ప్రతిపక్ష శాసన సభ్యుల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ ఎవరు జరిపారన్నది తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూ వుండరు. ఈ ప్రశ్నలు ఎవరైనా వేయడం జగన్ కు నచ్చదు. ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేయగానే వారు ఏడ్పో ఓదార్పో మొదలెడతారు. రాజకీయాల్లో  ఏడుపే జగన్  ఆయుధం!


        రాజకీయాల్లో సానుభూతికి కొన్ని ఓట్లు పడేమాట నిజమేగానీ, అయిదేళ్ళు సానుభూతి కొనసాగుతుందని అనుకోవడం భ్రమ. పైగా జగన్ లాంటి బూటకపు మనుషుల మీద సానుభూతి అస్సలు వుండదు. 

No comments:

Post a Comment