చంద్రబాబు మీడియా ప్లాన్ ముచ్చటగా మూడోసారి బొక్కబోర్లా పడబోతోంది.
ఒక అబధ్ధాన్ని నిజంగా మార్చడంలో వారు సిధ్ధహస్తులు. జాతీయ రాజకీయాల్లో వారి పేరు నరేంద్ర మోదీ అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారిపేరు చంద్రబాబు నాయుడు. మీడియా వాళ్ల చేతుల్లో నాట్యం ఆడుతూ వుంటుంది.
అంధ్రప్రదేశ్ వునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనను కేంద్ర కేబినేట్ అంగీకరించడానికి ఒక వారం ముందు ఒక సుప్రసిధ్ధ వార్తా జనాభిప్రాయ సేకరణ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అందులో రాయలసిమ - కోస్తాంధ్ర ప్రాంతాల్లో జగన్ పార్టి స్వీప్ చేస్తున్నట్టు ఫలితాలొచ్చాయి.
ఇలాంటి ఫలితాలు రుచించని తెలుగు తమ్ముళ్ళు ఆ సర్వే సంస్థ మీద కారాలు మిరియాలు నూరారు. చంద్రబాబు అలా తిట్టి ఊరుకునే రకం కాదు. రెండో స్థానం లో తాను వున్నట్టు ప్రచారం మొదలెట్టారు. చంద్రబాబు ఏది చెప్పినా ఆదేశంగా భావించే మీడియా సంస్థలు కొన్నాళ్ళు దాన్నే ప్రచారంలో పెట్టాయి. ఇది చంద్రబాబు మీడియా ప్లాన్ - 1
అక్కడ నుండి చంద్రబాబు మీడియా ప్లాన్ – 2 మొదలయ్యింది. దీని ప్రకారం చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్టూ, జగన్ గ్రాఫ్ తగ్గుతున్నట్టూ మీడియాలో కథనాలు రావడం మొదలయ్యాయి. చంద్రబాబు మీడియా ప్లాన్ – 2 ముగిసే నాటికి జగన్ గ్రాఫ్ 20 నుండి దిగివచ్చి 15 దగ్గర ఆగింది. చంద్రబాబు గ్రాఫ్ 9 నుండి పెరిగి 14 వద్ద ఆగింది.
వారం క్రితం చంద్రబాబు మీడియా ప్లాన్ – 3 మొదలయ్యింది. దీని ప్రకారం, తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ టిడిపి-బీజేపి కూటమి విజయ ఢంకా మోగిస్తున్నదని ప్రచారం మొదలయ్యింది. ఇలాంటి ప్రచారం వల్ల చంద్రబాబు మూడు ప్రయోజనాలు సాధించదలిచారు. మొదటిది, బీజేపిని పొత్తుకు ఒప్పించడానికి వత్తిడి పెంచడం. రెండోది, తాను అధికారంనికి వస్తున్నట్టు మీడియా ద్వార సంకేతాలివ్వడం. మూడోది, కాంగ్రెస్ అస్సలు పోటీలో లేదనే భ్రమ కలిగించడం.
కాంగ్రెస్ లో కొందరు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా, పెత్తందారీ సామాజికవర్గాలకు చెందినవారు పార్టీని వదిలిపోయిన విషయం వాస్తవమే. అయితే, కాంగ్రెస్ లోని దిగువశ్రేణులు చెక్కుచెదరకుండా అలానే వున్నాయి. ఈ వాస్తవాన్ని చంద్రబాబు బయటికి రానివ్వరు. ఆయనను ప్రమోట్ చేసే మీడియా కూడా బయటికి రానివ్వదు.
చంద్రబాబు మీడియా సాగిస్తున్న అబధ్ధాల ప్రచరంలో అణగారిన వాస్తవం ఏమంటే, బయటికి వెళ్ళిన పాత నాయకులు తిరిగి కాంగ్రెస్ స్వంత గూటికి చేరుకుంటున్నారు. జై మైక్యాంధ్ర వ్యవస్థాపకులు సహితం స్వగృహ బాటలో వున్నారనే సంకేతాలున్నాయి.
ఎన్నికలు దగ్గరపడ్డ ప్రతిసారీ చంద్రబాబు ఇలా హడావిడి చేయడం, గెలిచిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేసువడం మామూలే. వారు 2004 లో ఇదే బీజేపీతో కలిసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఎంత హడావిడి చేశారో, ఎంత ఘోరంగా ఓడిపోయారో, ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఆ ఎన్నికల్లో టిడిపికి 36 లోక్ సభా స్థానాలు, 200 లకు పైగా అసెంబ్లీ స్థానాలు వస్తున్నట్టు చంద్రబాబు మీడియా ప్రచారం చేసింది.
2004 ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్, వామపక్షాలతో కలిసి మహకూటమిని ఏర్పాటు చేసినపుడు తెలుగు తమ్ముళ్ళు గెలిచేసినట్టే హడావిడి చేశారు. గాలి కాంగ్రెస్ నుండి టిడిపికి మళ్ళీ నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. తొలివిడతగా తెలంగాణలో పోలింగు ముగిసినపుడు తెలుగు తమ్ముళ్ళు మిఠాయిలు పంచుకుని బూటకపు విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. ఇలాంటి మైండ్ గేమ్ లో చంద్రబాబు సిధ్ధహస్తులు. వాస్తవం ఏమిటో, ఫలితాలు వచ్చాకగానీ తెలియలేదు. 2004, 2009 లో జరిగిందే ఇప్పుడూ జరగబోతోంది. జరుగుతుంది. చంద్రబాబు మీడియా ప్లాన్ ముచ్చటగా మూడోసారి బొక్కబోర్లా పడబోతోంది.

No comments:
Post a Comment