Tuesday 22 April 2014

చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు

చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు

Published at: 22-04-2014 11:35 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 : చుండూరు ఊచకోత నిందితులకు హైకోర్టు శిక్ష రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పును వెలవడించింది. ఈ కేసులో 21 మందికి జీవిత ఖైదు, 35 మంది ఏడాది జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. శిక్ష రద్దు అయిన నిందితులు ఎటువంటి సంబరాలు చేసుకోకుండా మూడు నెలల పాటు చుండూరులో శాంతిభద్రలను పరిరక్షించాలని గుంటూరు జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1991లో గుంటూరు జిల్లా చుండూరులో దళితులు ఊచకోతకు గురైన విషయం తెలిసిందే.
హైకోర్టు తీర్పుపై దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కత్తిపద్మారావు తెలిపారు. హైకోర్టు తీర్పు దళిత వ్యతిరేకమి, బాధితులకు న్యాయం జరగలేదని ఏపీసీఎల్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment