Saturday 12 July 2014

INR 25, 626 Crores for APNGO Basic salaries

ఎన్టీఆర్ వల్లే తెలుగు వారికి గుర్తింపు, గౌరవం హైదరాబాద్ అభివృద్ధి ఘనత చంద్రబాబుదే : అశోక్‌బాబు

Published at: 12-07-2014 13:48 PM
విజయవాడ, జులై 12 : స్వర్గీయ నందమూరి తారకరామారావు వల్లే తెలుగువారికి గుర్తింపు, గౌరవం వచ్చాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. శనివారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఏపీఎన్జీవోలు సత్కారించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ చరిత్రలో ఈ రోజు మరిచిపోలేనిదన్నారు. చంద్రబాబును మారిన మనిషి అని చెప్పను గాని పరిణితి చెందిన నేతగా గుర్తిస్తామని అశోక్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు.
రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని విభజించారని అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ కేన్సర్ లాంటిదని, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అశోక్‌బాబు వినతి చేశారు. పీఆర్సీని తొందరగా ఫైనల్ చేయాలని కోరారు. హెల్త్‌కార్డ్‌పై విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డ్స్‌తో ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదని, హెల్త్‌కార్డులను తొందరగా ఇస్తారని ఆశిస్తున్నామని అశోక్‌బాబు తెలిపారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచడం సంతోషకమరమైన విషయమన్నారు. హైదరాబాద్‌లో పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, ఏపీ క్యాపిటల్ ఎక్కడైనా తాము పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మీరే అధికారంలోకి రావాలని అశోక్‌బాబు ఆకాంక్షించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని, ఉద్యోగుల అవినీతి పట్ల కఠినంగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. ఉద్యోగుల్లో ఏపీని అభివృద్ధి చేయాలన్న కసి ఉందని తెలిపారు.
ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులను తాము వెనుకేసుకురామని, ఉద్యోగులు భయంతో కాదు ఇష్టంతో పనిచేయాలనుకుంటున్నారని అశోక్‌బాబు తెలిపారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు 4 లక్షల మంది ఉద్యోగులు ఒకరోజు బేసిక్ వేతనం రూ.70 కోట్లు ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు అశోక్‌బాబు ప్రకటించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లోటు ఉన్న ఏపీలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకూడదని అశోక్‌బాబు పేర్కొన్నారు.

No comments:

Post a Comment