Friday 18 July 2014

సంభావ్యతలని గుర్తించడం చాలా కష్టం.

Padmakar Daggumati చరిత్రలో గానీ, మానవ జీవితంలో గానీ సంభావ్యతలని గుర్తించడం చాలా కష్టం. ప్రకృతి ప్రతి అవకాశాన్ని కూడా తన చేతిలో సగం ఉంచుకుని, మిగతా సగం మాత్రమే మనిషికి అందిస్తుంది! అంతా మనిషి చేతిలో ఉందనుకోవడం యవ్వనం కలిగించే ఒక భ్రమ! ఆ దశ ప్రకృతి సంభావ్యతలకి అంతగా విలువ ఇవ్వదు. మనిషి లోని సర్వ శక్తులని ఉపయోగించుకోవడానికి ప్రకృతే యవ్వనాన్ని మనిషికి ప్రసాదించింది. అయితే ఆ యవ్వనం తాలూకు పునరుత్పత్తి కోటాని మాత్రమే మనిషి పూర్తి చేస్తుంటాడు! మిగతా కోటాని బేలన్స్ చేయడానికి తిరిగి ప్రకృతి అనివార్యంగా తన శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ జీవన యానంలో ఇన్స్టింక్ట్స్ ని మాత్రమే అంటిపెట్టుకున్న సగటు మనిషికి ఇదంతా అనవసరం కావచ్చు. కొందరికి మాత్రం ఈ సంభావ్యతల పరిశోధన ఆక్సిజన్ లాంటిది. వారెప్పుడూ, అవతల స్టాపులో పోలీసులు లైసెన్సులు చెక్ చేస్తున్నారని హెచ్చరిస్తున్న వారిలా తమపని తాము శ్వాసిస్తు ఉంటారు. వారొక చిరునవ్వును మించి ఆశించరు.

No comments:

Post a Comment