Wednesday 9 July 2014

2014 Budget Highlights

2014 -సాధారణ బడ్జెట్ హైలెట్స్

Sakshi | Updated: July 10, 2014 12:14 (IST)
2014 -సాధారణ బడ్జెట్ హైలెట్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్
* భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
* కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
* విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
* రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు
* ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ
* సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు
* వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు
* మూలధనం పెంపుకు జాతీయ బ్యాంకుల వాటా అమ్మకం
* నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం
* తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు
* సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు
* ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు
* హార్డ్ వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి
* 2022 నాటికి అందరికీ ఇళ్లు
* గోదాముల కోసం రూ.5కోట్లు
* తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ
* ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు
* గిరిజనుల వనబంధు పథకానికి రూ.100 కోట్లు
* సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు
* 2019 నాటికి పరిశుభ్ర భారత్
* సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు
* గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు
* మహిళల భద్రతకు రూ.150 కోట్లు
* దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు
* పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్
* యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం
* మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు
* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ లకు 500 కోట్లు
* కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు
* కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు
* నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు
* ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు కోసం
* బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు
* వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు
* గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు
* గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు
* ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్ డీఐలకు ప్రోత్సహం
* ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు
* గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు
* గుజరాత్ తరహా పట్టణీకరణకు చర్యలు
* ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు
* పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం
* సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు
* గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు
* ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల
* సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన
* ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు
* గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా
* ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు
* వ్యయ-యాజమాన్య కమిషన్ ఏర్పాటు
* పర్యాటక రంగం ప్రోత్సాహానికి 9 ఎయిర్ పోర్టుల్లో ఈ-వీసాలకు అనుమతి
* త్వరలో కొత్త యూరియా పాలసీ
* ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యం
* ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేవు
* 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు
* ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
* తయారీ రంగంలో  ఎఫ్ డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు
* బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది
* బీమా రంగంలో 49 శాతం ఎఫ్ డీఐలకు కృషి
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు
* నల్లధనం దేశానికి శాపంగా మారింది
* మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం
* గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గిస్తాం
* రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది
* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది
* ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం
* అర్హులకే సబ్సీడీలు అందేలా చర్యలు
* రక్షణ, బీమా రంగంలో 41 శాతం ఎఫ్ డీఐ
* రెండు,మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు
* 2015 ద్రవ్యలోటు 3.6 శాతం
* భవిష్యత్ తరాలకు రుణభారాలు మిగల్చరాదు
* అవసరానికి మించి ఖర్చులు చేయలేం
* పన్ను వసూళ్లు మెరుగు పరచాలి
* పన్ను, జీడీపీ రేటును పెంచాలి
*  అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్
* బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రయత్నం
* భారత్ మార్పు కోరుకుంటుంది
* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు
* రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నాం
* గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాల వల్ల అవకాశాలు కోల్పోయం
*దారిద్ర్య రేఖ నుంచి బయటకు రావటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ వర్సిటీ

Sakshi | Updated: July 10, 2014 12:17 (IST)
ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ వర్సిటీవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : తన బడ్జెట్ తొలి భాగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వ విద్యాలయాలను ఆయన కేటాయించారు. అయితే, ఇంతకుముందు విభజన సమయంలో చెప్పినట్లుగా ఐఐఎంను మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఒకదాన్ని ఆయన కేటాయించారు.

దేశం మొత్తమ్మీద ఐదు కొత్త ఐఐటీలను ఏర్పాటుచేయబోతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐఐటీని ఇచ్చారు. దాంతోపాటు రెండు సంస్థలను కూడా ఆయన కేటాయించారు.


'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'

PTI | Updated: July 10, 2014 11:38 (IST)
'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'
న్యూఢిల్లీ: అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ను గురువారం ఆయన ప్రవేశపెట్టారు. అందరికీ సాయం, అందరికీ అభివృద్ధి(సబ్ కే సాత్, సబ్ కా వికాస్) అనేదే తమ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నాడు.

రెండు, మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటును అధిగమించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. నల్లధనం కలుగుతున్న నష్టాన్ని గుర్తించామని చెప్పారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడించారు.

No comments:

Post a Comment