Wednesday 23 July 2014

ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత విద్యార్థుల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ...అడ్డుకున్న పోలీసులు

Published at: 23-07-2014 13:15 PM
హైదరాబాద్, జులై 23 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించొద్దంటూ గత ఏడు రోజులుగా ఓయూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులు టెంట్ వేసి బ్యానర్‌ను కట్టే సమయంలో బయట నుంచి వచ్చిన విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు కాలర్ పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఘర్షణ తీవ్రం కావడంతో వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టడంతో పరిస్థితి సర్దుమణిగింది.

No comments:

Post a Comment