Saturday 12 July 2014

తెలంగాణ నీటిపారుదల పితామహడు - నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌.


అలీ నవాజ్‌ జంగ్‌కు అరుదైన గౌరవం

Published at: 10-07-2014 03:25 AM
ఆయన జయంతి జూలై 11న ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’
ఫైలుపై కేసీఆర్‌ సంతకం
రేపు జలసౌధలో విగ్రహావిష్కరణ
హైదరాబాద్‌, జూలై 9: తెలంగాణ సాగునీటి రంగ పితామ్‌హుడు.. ప్రముఖ ఇంజనీరు అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదినమైన జూలై 11ను ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’గా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫైలును సీఎం చంద్రశేఖరరావు ఆమోదించారు. ఈ మేరకు, శుక్రవారం ఇక్కడి ఎర్రమంజిల్‌లోని జలసౌధ ప్రాంగణంలో అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ విగ్రహాన్ని మంత్రి టి.హరీశ్‌రావు ఆవిష్కరించనున్నారు. అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదినాన్ని ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’గా గుర్తించడం పట్ల తెలంగాణ ఇంజనీర్స్‌ జేఏసీ చైర్మన్‌ వెంకటేశ్‌, కో-చైర్మన్‌ శ్రీధర్‌ దేశ్‌పాండే హర్షం వ్యక్తం చేశారు.
మోక్షగుండం సమ్‌కాలికుడు..

హైదరాబాద్‌ సంస్థానంలో అనేక భారీ, మ్‌ధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌.. ప్రఖ్యాత ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమ్‌కాలికుడు. ఈయన అసలు పేరు మీర్‌ అహ్మద్‌ అలీ. 1877లో హైదరాబాద్‌లో సాధారణ మ్‌ధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత కూపర్‌హిల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు. నేడు మ్‌నం గొప్పగా చెప్పుకొనే నిజాం సాగర్‌, వైరా, పాలేరు, పోచంపాడు, నందికొండ, భీమ, పెన్‌గంగ, ఇచ్చంపల్లి, లోయర్‌ మనేరు తదితర ప్రాజెక్టులు ఆయన రూపకల్పన చేసినవి లేదా నిర్మించినవే. అలాగే.. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ భవనం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి భవనం వంటివి భవన నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు అనడం అతిశయోక్తి కాదుఆంధ్రాలో పనిచేసే ఇంజనీర్లనూ తీసుకొస్తాం

Published at: 12-07-2014 05:05 AM
రిటైరైనవారి సేవలూ వినియోగించుకుంటాం
త్వరలో 600 ఖాళీల భర్తీ
ఐదు, ఆరు జోన్లు సహకరిస్తే పదోన్నతులు
తెలంగాణ ఇంజనీర్స్‌డేలో మంత్రి హరీశ్‌రావు
జలసౌధలో అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ విగ్రహావిష్కరణ
జంగ్‌ వారసులకు, విద్యాసాగర్‌రావుకు సన్మానం
(హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి) హైదరాబాద్‌ నగరంలో అనేక ప్రాజెక్టులతో పాటు అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించిన మహనీయుడు, తొలి తెలంగాణ నీటిపారుదల పితామహడు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌. ఆయన రూపొందించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీయే ఇప్పటికీ అవసరాలు తీరుస్తోంది. శుక్రవారం ఆయన జయంతి. ఈ సందర్భంగా  తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ, తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం సంయుక్తంగా శుక్రవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ‘తొలి తెలంగాణ ఇంజనీర్స్‌ డే’ ఉత్సవం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని, జంగ్‌ వారసుల సమక్షంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జంగ్‌ వారసులను, నీటి పారుదల శాఖ సలహాదారుడు ఆర్‌.విద్యాసాగర్‌రావును సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, ‘నవాజ్‌ జంగ్‌ స్ఫూర్తితో పోరాటంలా తెలంగాణ పునర్నిర్మాణం చేపడదాం. కేవలం కట్టడాలుగా కాకుండా జాతికి ఉపయోగపడే ప్రాజెక్టులు, నిర్మాణాలు చేపడదాం. జంగ్‌ నిర్మాణాలు తెలంగాణ సంపద.. మీ కృషి (ఇంజనీర్ల) రేపటి తెలంగాణ జాతి సంపద కావాలి. ఇకపై ప్రాజెక్టుకు పనిచేసే ఇంజనీర్ల పేర్లన్నీ శిలాఫలకాలపై నమోదు చేయిస్తాం..’’ అని ప్రకటించారు.
ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లను ఇక్కడికి తెచ్చుకుందామని, ఉద్యోగుల శాశ్వత విభజన పూర్తయ్యేంతవరకు వేచి ఉండాలని ఇంజనీర్లకు మంత్రి సూచించారు. రిటైర్డ్‌ ఇంజనీర్ల సేవలను కూడా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. త్వరలో నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న 600 ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంగీకరించారని తెలిపారు. ఐదు, ఆరు జోన్లకు సంబంధించిన ఇంజనీర్లు సహకరిస్తే సర్వీసు వివాదాలను పరిష్కరించి.. అవసరమైతే సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించి, రెగ్యులర్‌ పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ ఇంజనీర్ల సంఘం కార్యాలయ నిర్మాణానికి భూమితో పాటు 50 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు.
కాగా, సొంతగడ్డ మీద స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న భావన ఎంతో తృప్తినిస్తోందని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు అన్నారు. ఇంజనీర్లు అంటే ఆర్దర్‌ కాటన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్‌ రావు పేర్లే చెబుతారని,  తెలంగాణలో అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నా గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. తనకు, తన పిల్లలకూ జంగ్‌ వంటి తెలంగాణ ఇంజనీర్ల పేర్లు వినిపించనే లేదని, ఇక చరిత్రను వక్రీకరించడం ఎవరి వల్లా కాదని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. తాను జంగ్‌ నిర్మించిన ఆర్ట్స్‌ కాలేజీలో చదివానని, తక్కువ ఖర్చు, తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి అన్నారు. జంగ్‌ స్ఫూర్తితో ఇంజనీర్లు తెలంగాణ సోయితో పనిచేయాలని, కృష్ణా గోదావరి జలాల మళ్లింపుపై ప్రధాన దృష్టి పెట్టాలని తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం జనరల్‌ సెక్రటరీ శ్యాం ప్రసాద్‌ రెడ్డి అన్నారు.
ఓయూలో, మింట్‌ కాంపౌండ్‌లో వేడుకలు
కాగా, అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఆయన 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఈ కార్యక్రమానికి హాజరై నిజామ్‌ నవాబులు చేసిన కృషిని కొనియాడారు. మింట్‌ కాంపౌండ్‌లోనూ ఇంజనీర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవాబ్‌ జంగ్‌ మనుమడు, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ అన్వరుద్ధీన్‌ ప్రసంగించారు.

No comments:

Post a Comment