Thursday 3 July 2014

AP NGO భూములు వేనక్కి తీసుకోవడం అనాలోచిత చర్య

టి. ప్రభుత్వం భూములు వేనక్కి తీసుకోవడం అనాలోచిత చర్య : అశోక్‌బాబు

Published at: 03-07-2014 18:32 PM
హైదరాబాద్, జులై 3 : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీఎన్జీవోలు భగ్గుమంటున్నారు. గతంలో గోపనపల్లిలో ఏపీ ఎన్జీవోలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు టి. ప్రభుత్వం ఉత్తర్వులను గురువారం ఏపీఎన్జీవో కార్యాలయానికి పంపింది. దీనిపై స్పందించిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన భూములను తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవడం అనాలోచిత చర్య అని అభివర్ణించారు.189 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం తమకు ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కాదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారని ఆయన తెలిపారు.
అయినా 2003 తర్వాత ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు భూమి అప్పగించిన తర్వాత సభ్యులను చేర్చుకుని, ఆ భూమిని సాగు చేసి, లే ఔట్లు వేయడం జరిగిందని అశోక్‌బాబు తెలిపారు. 2010లో 90 ఎకరాల భూమికి సంబంధించి ఒక వివాదంలో ఇది ప్రభుత్వ భూమికాదని, ప్రైవేట్ వ్యక్తులదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మేము (ఏపీఎన్జీవోలు), ప్రభుత్వం కలిసి 2011లో సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుందని, సుప్రీం కోర్టు కూడా తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పిందని అశోక్‌బాలు వెల్లడించారు.
అప్పటికే ఈ భూమిపై సుమారు రూ. 3 కోట్లు ఖర్చుపెట్టి లే అవుట్ అప్రూవ్ చేయించామని, 165 గజాలు ఉన్న స్థలాలను 100 గజాలుగా మార్చామని అశోక్‌బాబు చెప్పారు. ఆ రోజన 1644 మందికి ఇల్ల స్థలాలు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కేసు విచారణలో ఉన్న 90 ఎకరాల భూమి కాకుండా మిగతా భూమిలో లే అవుట్లు వేసి పంచినట్లు ఆయన చెప్పారు. 90 ఎకరాలతోపాటు 10 ఎకరాలు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చారు. ఆ భూమిపై ఇంకొక వ్యక్తి ఆ భూమి తనదని కోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు. అది కూడా హైకోర్టులో ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, అప్పుడు మేము డివిజన్ బెంచ్‌కువెళ్లి స్టే తీసుకువచ్చినట్లు అశోక్‌బాబు చెప్పారు. ఇక్కడ హైకోర్టు బెంచ్ కూడా ఈ కేసు తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 2011లో సుప్రీంకోర్టు, 2013లో హైకోర్టు ఇచ్చిన తర్వాత మేము లే అవుట్ అఫ్రూవ్ చేయించుకుని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి వేసి, పవర్ లైను వేసి, పార్కులు కట్టి దాదాపు నెలకు రూ. 30 వేలు దానిపై ఖర్చు పెట్టినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేకపోయామని, దానికి కారణం కోర్టు అభ్యంతరాలేనని అశోక్‌బాబు తెలిపారు. మేము గనక ఈ భూమిని నిరూపయోగంగా పెట్టుకుంటే ప్రభుత్వం చెప్పిన వాదనను అంగీకరిస్తామని ఆయన అన్నారు. ఈరోజు రెవెన్యూ శాఖ నుంచి తమకు ఒక మెమో వచ్చిందని ''ప్రభుత్వం భూమి ఇచ్చి ఆరేళ్లు అయిందని, ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, తెలంగాణ ల్యాండ్ డెవలప్‌మెంట్ బోర్డు పెట్టామని, దాని నిర్ణయం ప్రకారం ఆ భూమిని వెనక్కి తీసుకుంటున్నామని'' ఆ మెమోలో ఉందని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం వద్దకు వెళ్ళి అన్ని విషయాలు వివరిస్తామని, భూములు వెనక్కి తీసుకోవడం సరికాదని చెబుతామని దానిపై ప్రభుత్వ స్పందనను చూసి తర్వాత ఏమి చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment