Saturday 26 July 2014

ముగిసిన ఏపీ రాజధాని కమిటీ సమావేశం


ముగిసిన ఏపీ రాజధాని కమిటీ సమావేశం

Published at: 26-07-2014 11:47 AM
హైదరాబాద్, జులై 26 : సచివాలయంలో ఏపీ రాజధాని కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది కమిటీ సభ్యులు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు మెకంజీ, ఎల్అండటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా రాజధానులను పరిశీలించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించడంపై కమిటీ దృష్టి సారించింది. దాదాపు 20 నుంచి 30 వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన మూడు నెలలలోపు భూసేకరణ పూర్తి చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈరోజు 11:30 గంటలకు చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశం కానుంది.

No comments:

Post a Comment