టీడీపీ లేఖతోనే తెలంగాణపై నిర్ణయం
పచ్చపార్టీ ఉచ్చ తాగే
ఇంతదూరం
పదవి, పైసలు ఇవ్వలేదని నీ అక్కసు
గద్దర్, మందకృష్ణను పిలవలేదు
కేసీఆర్‌పూ మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్ ఫైర్
పదవి, పైసలు ఇవ్వలేదని నీ అక్కసు
గద్దర్, మందకృష్ణను పిలవలేదు
కేసీఆర్‌పూ మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్ ఫైర్
కరీంనగర్/హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అనుముల రేవంత్ రెడ్డి సోమవారం వేర్వేరు వేదికలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు కరీంనగర్‌లో జిల్లాస్థాయి పార్టీ కార్యకర్తల భేటీలో టీ-టీడీపీ ఫోరం నేత మోత్కుపల్లి మాట్లాడుతూ... "బిడ్డా కేసీఆర్.. తెలంగాణ ఎలా వచ్చింది? నువ్వడిగితే ఇచ్చా రా? టీడీపీ లేఖ ఇస్తేనే ఇచ్చారు. నీది తోక పార్టీ. నీ దుకాణం బంద్ అయ్యింది. పచ్చ పార్టీ ఉచ్చ తాగితేనే ఇంత దూరం వచ్చావు. నువ్వు వలసవాదివి. తెలంగాణ రావద్దనే ఆం«ద్రులను రెచ్చగొడుతున్నావు'' అని నిప్పులు చెరిగారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సకల జనభేరి సభలో కేసీఆర్ భాష, మాటలను అందరూ విన్నారని ఆయన గుర్తుచేశారు. "ఒకరోజు మంత్రి పదవి ఇవ్వకుంటే పంచాయతీ పెట్టావు, మరొక రోజు.. పొత్తు కుదిరినప్పుడు పైసలు ఇవ్వకుంటే పక్కకు జరిగావు. బిడ్డా కేసీఆర్.. తెలంగాణలో నీ దుకాణం బంద్ అ య్యింది'' అని దుయ్యబట్టారు. చంద్రబాబు లేఖ ఇచ్చేవరకూ తెలంగాణపై కేంద్రంలో కదలిక లేదన్నారు.
సకల జనభేరి సభకు గద్దర్, మంద కృష్ణమాదిగ, అమరవీరుల కుటుంబాల సభ్యులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తాము లేఖ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదని, దీన్ని కాదంటున్న కేసీఆర్ 2009లో తమతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో రూ.200 కోట్లు డిమాండ్ చేశాడని, పైసలు ఇవ్వకపోవడంతో సీట్లను కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. విజయనగరం జిల్లానుంచి వలస వచ్చిన కేసీఆర్.. ఇంత త్వరగా తన దుకాణం బంద్ అవుతుందని ఊహించి ఉండడని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. అందుకే ఆంధ్రోళ్లను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నాడని విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే ఎవరు అడ్డు పడుతున్నారో తేలుతుందని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇదే సభలో అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయనందు కే సీడబ్ల్యూసీ తీర్మానం చేసి 60 రోజులు గడుస్తున్నా బిల్లు మాటెత్తడం లేదన్నారు.
'సమైక్య ఉద్యమంలో సీమాంధ్ర నేతలు అలసిపోయి కూర్చుంటే కేసీఆర్ రంగంలో దిగి, బండ బూతులతో వారిని లేపి కూర్చోబెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మా ట్లాడారు. కేసీఆర్ తిట్లు, శాపనార్థాలతో తమ ఉద్యమాన్ని బతికిస్తున్నందుకు సీమాంధ్ర నేతలు సన్మానిస్తారేమోనని ఎద్దేవా చేశారు. 'ఆంధ్రలో పుట్టినవాళ్లంతా ద్రోహులంటున్నారు. మరి తెలంగాణ కావాలంటున్న వెంకయ్యనాయుడు, సీపీఐ నారాయణ కూడా ద్రోహులేనా? సఖ్యతగా విడిపోదామంటూనే వా రిని రాక్షసులని తిట్టడం ఎందుకు? ఇంతవరకూ ఒక్క అడుగు ముందుకు వేయని సోనియాను ఒక్కమాట అనవేం? నిజంగా తెలంగాణ వస్తే ఫాం హౌస్‌లో టెంకాయలు, వంకాయలు అమ్ముకోవాలని కేసీఆర్ భయం. కాబట్టే విభజన ప్రకటన వచ్చిన రోజు ఆయన మొహం తుఫాన్లో సర్వం కోల్పోయినవాడిలా, దివాలా తీసిన వాడి మాదిరిగా ఉంది' అని ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment