కేసీఆర్‌పై విమర్శల భేరి!
ప్రజలను అవమానించడం సరికాదు : నారాయణ
సీమాం«ద్రులంతా ద్రోహులా? :దత్తాత్రేయ
మీ జాతకం చూసుకోండి
సీమాం«ద్రులంతా ద్రోహులా? :దత్తాత్రేయ
మీ జాతకం చూసుకోండి
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
సకల జన భేరి వేదికగా గులాబీ దళపతి కేసీఆర్ చేసి న ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్ర ప్రజలనుద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను..తెలంగాణకు గట్టి మద్దతు ఇస్తున్న సీపీఐ, బీజేపీ సైతం ఆక్షేపించగా, కేసీఆర్ తీరును కాంగ్రెస్ పార్టీ ఘా టుగా దుయ్యబట్టింది. "ఆంధ్రా ప్రజలు దోపిడీదారులం టూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. తెలంగాణ కోరుకునే నాయకుడు మాట్లాడే మా టలు కావవి'' అని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బం డారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ధ్వజమెత్తారు. ప్రాం తాలే విడిపోతున్నాయి కానీ ప్రజలు కాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. సభ బాగా జరిగినా, లంకలో పుట్టినోళ్లు రాక్షసులని, సీమాంధ్రలో పుట్టినోల్లు తెలంగాణ ద్రోహులని కేసీఆర్ అనడం సరిగా లేదని కడపలో విమర్శించారు. "నాయకులు చేసిన తప్పులకు ప్రజలను అవమానించడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలత ఏర్పడుతున్న దశలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు'' అన్నారు. రాజీనామాలు చేస్తే ఓటింగ్‌లో ఓడిపోతామంటున్నారని, అసలు అసెంబ్లీలో తీర్మానమే ఉండనప్పుడు ఓటింగ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అలాగే..హైదరాబాద్ కేసీఆర్ అబ్బసొత్తు గానీ, లగడపాటి అబ్బసొత్తు కాదన్నారు.

విభజన ప్రకటన వెలువడి ఇన్ని రోజులవుతున్నా సోనియా, మన్మోహన్‌లు వంకాయలు కోసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అలాగే.. కేసీఆర్ తీరును సీపీఐ కార్యవర్గం ఓ ప్రకటనలో ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రాంతీయ వైషమ్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జాతకం కేసీఆర్‌కు అనవసరమని, ముందు ఆయన జాతకం చూసుకుంటే మంచిదని ఏఐసీసీ ప్రతినిధి రేణుకా చౌదరి ఖమ్మంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్‌కు ఇష్టం లేదని తెలంగాణ-సీమాంధ్ర జేఏసీ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ విమర్శించారు. నోటి దాకా వచ్చిన తెలంగాణను దూరంగా నెట్టేయడానికే ఆయన ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలకు దిగుతున్నారని హైదరాబాద్‌లో ఆయన మండిపడ్డారు. "తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఆరాచక వాదంలోనికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడం కోసమే కేసీఆర్ ఉద్యమిస్తున్నారు. ఆయన పోరాటానికి సిద్ధాంతపరమైన రాజకీయ పునాది లేదు. అక్టోబర్ 5న బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులు, విద్యార్థి, కార్మిక, యువజన వర్గాలను తిరిగి ఒక వేదిక మీదకు తెస్తామని వెల్లడించారు.
No comments:
Post a Comment