Sunday, 8 September 2013

మా వాళ్లే తెలుగుతల్లి మెడ నరకమన్నారు!

మా వాళ్లే తెలుగుతల్లి మెడ నరకమన్నారు!

September 09, 2013

హైదరాబాద్, సెప్టెంబర్ 8 : " సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మా వాళ్లే తెలుగు తల్లి మెడను నరికేయమని అధిష్ఠానానికి చెప్పారు. ఒక వేటుకు తెగవేయకపోతే ఉద్యమాలు వస్తాయని ఢిల్లీలో తిష్టవేసి ఇప్పుడు కూడా చెబుతున్నారు. అట్లా చేస్తే మరో ముఖ్యమంత్రి వస్తారనే భావనలో ఉన్నారు. పదవుల కోసం గోతి దగ్గర గుంట నక్కల్లా కాచుక్కూర్చోని ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా తెలుగు తల్లిపై
వేటు వేసేయండంటున్నారు. అలాంటి నేతల మాటలు చెల్లుబాటు కాకుండా చేస్తాం. వారి ప్రయత్నాలను వమ్ము చేస్తాం'' అని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, అటువంటి వారి పేర్లను సరైన సమయంలో వెల్లడిస్తానని కూడా చెప్పారు. ప్రజల బాధలు గ్రహించకుండా పదవే పరమావధిగా వ్యవహరిస్తున్నవారికి ఏపీఎన్జీవోల సభ కనువిప్పు కావాలని హితవు పలికారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. "మేము బహిరంగ యుద్ధం చేస్తుండగా, వారు ముసుగులో యుద్ధం చేస్తున్నారు. అంతిమ విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు'' అని మండిపడ్డారు. అనుమతి ఒకరోజు ముందు మాత్రమే ఇచ్చినా, ఎందరు రెచ్చగొట్టినా సభను సజావుగా నిర్వహించారంటూ ఏపీఎన్జీవోలను అ భినందించారు. ఉపాధ్యాయునిగా ఉన్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం సంకుచిత భావంతో సభకు అడ్డుతగిలారని, అసలు వారి వాదన లో బలమెంతని ప్రశ్నించారు.

"ఎ క్కడ తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటారో, సమైక్య వాదాన్ని ఏపీఎన్జీవోలు..ప్రజల్లో నాటతారోనని వేర్పాటు వాదులు ఆందోళన పడుతున్నారు. సభ ముగించుకొని వెళ్లే సీమాంధ్ర ఉద్యోగులకు అల్పాహారం, పూలూపళ్లు ఇచ్చి, ఆ తర్వాత బస్సులపై రాళ్లు వేయించారు'' అని టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. సభకు ముందురోజు హైకోర్టులో సీమా ంధ్ర లాయర్లపై దాడిచేసి 'ఇదే మా సంస్కృతి' అని చాటుకున్నారన్నారు. స్టార్ బ్యాట్స్‌మన్ (ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి) ప్రతిభతోనే సభ సక్సెస్ అయిందని, లక్షల మంది ఆయన వెనుక ఉన్నారని చెప్పారు. "మీటింగ్ పెడితే బంద్ చేస్తారా? పోలీసు యం త్రాంగం ఇలాంటి వారిపై గబ్బర్‌సింగ్ లా బెల్టు తీయాలి. ఎవరైనా విద్వేషాలు రగిల్చినా, ప్రజల మధ్య చిచ్చుపెట్టినా, కుల, మత, ప్రాంత విద్వేషాలు రగిల్చినా పోలీసులు గబ్బర్‌సింగ్‌లా తయారు కావాలి'' అని వ్యాఖ్యానించారు.

విభజనపై ముందుకు వెళుతున్నామన్న కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనపై ఆయన ఒకింత అసహ నం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకెళ్లాలో, వెనక్కెళ్లా లో తెలియని పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు.ఇదంతా చూస్తుంటే, పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చినట్లు 54% ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరాన్ని కేంద్రం తన్నుకుపోతుందేమోనన్న అనుమానాన్ని లగడపాటి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని ఏ రాష్ట్రమైనా ఎడారవుతుందన్నారు. సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలం రాజీనామా చేస్తేనే...కేంద్రం ఆంటోని కమిటీ వేసిందని చెప్పుకొచ్చారు.ఎవరి వల్లా కాకుంటే ప్రజలే మరో ఎనిమిది నెలల్లో జరిగే ఎన్నికల్లో 'విభజన'పై తీర్పు చెబుతారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా 240 స్థానాలు సమైక్యవాదులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కర్నూలు రాజధాని అయి ఉంటే హైదరాబాద్ కంటే ఎక్కు వ అభివృద్ధి చెందేదని వివరించారు. "ఉద్యమముండదు. ఆంధ్రా ను ఎన్ని ముక్కలైనా చెయండన్న నేతలను అధిష్ఠానం పెద్దలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా సమైక్య భావన బలపడింది. ప్రజల భావన బయటకొచ్చిన తర్వాత అన్నీ పార్టీలు మనస్సు మార్చుకున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజా శాసనానికి తలొగ్గాల్సిందే. సమైక్యత కోసం దేనికీ వెనుకాడే పరిస్థి తి లేదు. (కేంద్రం)అడుగు ముందుకేస్తే మా ప్రయత్నాలు మరో రకంగా ఉంటాయి. ఏ ఎత్తుగడతోనైనా సమైక్యాంధ్రను కాపాడుకు ంటాం''అని తెలిపారు.

తన అంచనాలను ఎవరు ఎన్నివిధాల ఎగతాళి చేసినా తాను చెప్పిందే ఎప్పుడూ నిజమైందన్నారు. టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు రంగునీళ్లు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించడంతో, అయామకుడైన శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేయగలిగినా, ఆపేయగలిగినా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రమే చేయగలదని, అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తామన్నారు. తాము పార్టీని వదిలి వెళ్తే వారికిష్టమైంది చేస్తారని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరని వివరించారు.

No comments:

Post a Comment