23 అంశాలతో బీసీ డిక్లరేషన్
September 16, 2013
హన్మకొండ, సెప్టెంబర్ 15 : బీసీలకు నిర్ధిష్టమైన రాజ్యాంగపరమైన గుర్తింపును కలిగించాలని ఆదివారం వరంగల్‌లో జరిగిన ఆత్మగౌరవ సభ డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ సభలో బీసీల సామాజిక, ఆర్ధికాభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలపై 23 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్‌ను జారీ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ ప్రతినిధుల సమక్షంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాధికారత సంస్థ (ఏబీసీడీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఈ డిక్లరేషన్ విడుదల చేశారు. గృహవసతి కల్పించాలని, ప్రభుత్వ కొనుగోళ్లలో వృత్తిదారుల ఉత్పత్తులు తప్పనిసరిగా 25 శాతం ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని, విద్య, ఉద్యోగ రంగాల్లోని రిజర్వేషన్లు కనీసం 50 శాతం పెంచాలన్నారు. బీసీ ఉప ప్రణాళికకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment