Wednesday, 11 September 2013

రాయల తెలంగాణ తీర్మానం చేయండి: జేసీ

రాయల తెలంగాణ తీర్మానం చేయండి: జేసీ

September 10, 2013
హైదరాబాద్, సెప్టెంబర్ 10 : 'రాయల తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయండి' అని తెలంగాణ కాంగ్రెస్ పత్రినిధులకు మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కోరారు. మంగళవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైన పాలకపక్ష తెలంగాణ ప్రజా ప్రతినిధులతో జేసీ పై విధంగా కోరారు. అయితే.. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చిస్తున్న సమయంలో జేసీ తమ మధ్యకు రావడంతో వారు ఆశ్చర్యపోయారు.

పైగా .. రాయల తెలంగాణకు సానుకూలంగా తీర్మానం చేయాలని జేసీ సూచించడంతో పలువురు విభేదించారు. సీమాం«ద్రులకు ఏం కావాలో తేల్చుకోవాలని కొందరు సూచించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ రాష్ట్రానికి తొలి గవర్నర్ అయ్యే అవకాశం ఉంటుందని జేసీతో మరికొందరు అన్నారు. ఈ సమయంలో జై తెలంగాణ అని నినదించారని తెలంగాణ ప్రజా ప్రతినిధులు వివరించారు. అయితే.. ఈ సమావేశం నుంచి బయటకు వచ్చిన జేసీ తాను జై సమైక్యాంధ్ర అని మాత్రమే నినదించానని అన్నారు

No comments:

Post a Comment