|
హైదరాబాద్ జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ను గద్దెదించుతా! కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తా. ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతా’’ అని టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన తర్వాత... చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా బయలుదేరిన రేవంత్... మార్గమధ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తెలంగాణ మంత్రులను తీవ్ర పదజాలంతో దునుమాడారు. మంత్రుల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతిని నిలదీసినందునే... కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని రేవంత్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన మొట్టమొదటి సంతకంతోనే మైహోం రామేశ్వరరావుకు 3 వేల కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారు. దీనిని నేను ప్రశ్నించాను. మెడికల్ ఫీజులు అడ్డగోలుగా పెంచడంపై హైకోర్టులో కేసు వేశాను. కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెబుతుంటే నిలదీశాను. అందుకే, నాపై కుట్రపన్ని కేసులో ఇరికించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ నాపైనే ప్రయోగించారు. చర్లపల్లి జైలులో 30 రోజుల పెడితే నేను లొంగిపోతానుకుంటే అది కేసీఆర్ భ్రమే. మిస్టర్ కేసీఆర్... 30 రోజుల జైలు జీవితం... అవసరమైతే నీ కుటుంబంపై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తాను’’ అని రేవంత్ హెచ్చరించారు. ఈ రోజు నుంచి టీఆర్‌ఎస్ నేతలకు లాగులు తడుస్తాయన్నారు. ‘‘రేవంత్ జైల్లో ఏడుస్తున్నాడా అని టీఆర్‌ఎస్ మంత్రులు అని జైలు అధికారులను అడిగారట! నేను స్కామ్ ఫైళ్లు చదువుతున్నానని, బయటకు వస్తే మీ పని పడతారని జైలు అధికారులు మంత్రులకు చెప్పారు. నిన్న నాకు బెయిల్ వచ్చింది. కేసీఆర్‌కు జ్వరం రావడం మాత్రమే కాదు! లాగు తడుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ లేకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నేను ఉన్నా. నా పార్టీ ఉంది. మా కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం జెండా ముట్టుకునే మగాడు లేదు. ఎవరన్నా ఉంటే రా చూసుకుందాం! తెలంగాణలో పార్టీకి నేనున్నాను. కార్యకర్తలున్నారు. మా నాయకులున్నారు. కేసీఆర్‌లో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే... ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామా చేయించాలి. వారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించుకుంటే నాలుగేళ్లు తెలంగాణలో మా పార్టీ జెండా ఎగురవేయం. అదే టీఆర్‌ఎస్ ఓటమిపాలైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేలకు ముక్కురాస్తారా?’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు. గతంలో టీడీపీని లేకుండా చేస్తానన్నవ్యక్తి 48 గంటల్లో పావురాల గుట్టలో పావురమై పోయాడని పరోక్షంగా వైఎస్‌ను విమర్శించారు.
మంత్రులపై రేవంత్ ఫైర్!
‘‘టీవీల్లో టీఆర్‌ఎస్ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నరు. వీళ్లంతా కేసీఆర్‌కు (పేరు ప్రస్తావించకుండానే) తందానా అంటున్నారు. వీరిలో ఒక్కరైనా పాత చెప్పుతో సమానంగా ఉన్నారా?’’ అని విమర్శించారు. వీరికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు సేవ చేయటం మాని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘విద్యార్థులకు రూ.7వేల కోట్ల స్కాలర్‌షి్‌పలు ఇవ్వలేదు. తెలంగాణలో పది యూనివర్సిటీలు ఉంటే ఒక్క వీసీని కూడా నియమించలేదు. ముందు ముందు వాళ్లను నియమించు’’ అని రేవంత్ సూచించారు. దుబాయ్‌కి జనాన్ని పంపిస్తానని మోసం చేసినట్లు కేసులు నమోదైతే ఢిల్లీలో ఎమెస్సార్ ఇంట్లో దాక్కున్నారంటూ కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన ఇప్పుడు పెద్ద ఉద్యమకారుడా! తెలంగాణ జాతిపితా! వీళ్లు తెలంగాణ తెస్తే... బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థులు ఎవరు?’’ అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు.
సన్నాసులు, బద్మాష్‌లు!
టీ-మంత్రులపై రేవంత్ విరుచుకుపడ్డారు. సన్నాసులు, బద్మా్‌షలు అనే పదాలను ప్రయోగించారు. వారి పేర్లు ప్రస్తావించకుండానే... ఆలుగడ్డలవాడు, గోచి పెట్టుకునేవాడు, అమ్మలాంటి పార్టీని అమ్ముకునేవాడు, లంబూ అంటూ పరోక్ష విమర్శలు గుప్పించారు. గ్లాసులు మోసే వాళ్లు, సోడాలు కలిపేవారు మంత్రులుగా ఉన్నారన్నారు.
|
No comments:
Post a Comment