|
హైదరాబాద్, జులై 14 : రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతిచెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రచార ఆర్భాటమే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది అంచనా వేయలేకపోవడం వైఫల్యమే అన్నారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కృష్ణాపుష్కరాల సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానాయాగీ చేశారని మండిపడ్డారు.
తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆయన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. కుంభమేళాను మించి అద్భుతంగా ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ విషాదం జరిగిందని చిరంజీవి ఆరోపించారు.
|
No comments:
Post a Comment