Monday, 20 July 2015

ఏపీ నూతన రాజధాని ‘అమరావతి’ నగర విశేషాలివే!

ఏపీ నూతన రాజధాని ‘అమరావతి’ నగర విశేషాలివే!

  No Comment Yet
ఏడువేల చదరపు కిలోమీటర్ల పరిధిలో, 55 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ ప్రాంతాన్ని 9 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం ఎలా వుండాలో సింగపూర్ ఇంజనీర్లు 14 భాగాలుగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ సమ్మరీ కాపీని telugu360.com సంపాదించింది.
మొత్తం విస్తీర్ణంలో 10 వేల ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల కోసం కేటాయించారు. రాజధాని ప్రాంతపు మౌలిక సదుపాయాలను 22 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. గుట్టలు, చెరువులు, ఫారెస్టు భూములు, ప్రజల నివాసాలకు మరో 15 వేల ఎకరాలు పోతుంది. మిగిలిన 8 వేల ఎకరాలే ప్రభుత్వానికి మిగులుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ వుండే ‘సీడ్ కేపిటల్’ కోసం 4 వేల ఎకరాలు వినియోగిస్తారు.
చెట్లు పార్కులకు 21 శాతం స్ధలాన్ని, కాలువలు, చేరువులకు 3 శాతం స్ధలాన్ని, కమర్షియల్ కాంప్లెక్సులకు 30 శాతం స్ధలాన్ని కేటాయించారు. నివాసాలనుంచి విద్యాసంస్ధలకు నడచికూడా వెళ్ళగలిగేలా కనెక్టివిటీ తో రోడ్లు వేస్తారు.
రాజధాని నగరంలో కృష్ణానదికి ఎదురుగా ఈశాన్యం వైపు త్రిభుజాకారంలో కొంతఖాళీ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. వాస్తుని దృష్టిలో వుంచుకుని ఖాళీగా వుంచిన ఈ ప్రదేశాన్ని ‘బ్రహ్మస్ధానం’ అని ప్రతిపాదించారు. విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఎనర్జీ రేస్ ఈశాన్యంలో వున్న ఖాళీ ప్రాంతం పక్కనుంచి ప్రసరించే మార్దాన్ని వుంచారట. మరో మార్గం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు వరకూ వుంటుంది.
కృష్ణానదికి ఎదురుగానే రాజధాని నిర్మాణం జరగనున్నా రాజధాని మధ్యలో ఒక ఆర్నమెంటల్ వాటర్ వే వుంటుంది.ఇందులో పడవలు లాంచీలు తిరుగుతాయి. ఢిల్లీ తరహా లో ప్రధాన రోడ్లకు ఒక వైపు పార్కు వుంటుంది. మొత్తం నగరంలో 80 కిలో మీటర్ల పొడవునా కాల్వలు, రిజర్వాయిర్లు వుంటాయి. విస్తీర్ణం 200 కిలోమీటర్ల వరకూ వుండ వచ్చు. రాజధాని చుట్టూ వున్న జల వనరులను అనుసంధానం చేసి బోటు ప్రయాణాలకోసం వాటర్ వే ని ఏర్పాటు చేస్తారు.
పరిసరాల్లో వున్న ఆలయాల్ని, చారిత్రక ప్రదేశాలకు రాజధానితో అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తారు. విజయవాడ కనకదుర్గ, మంగళగిరి పానకాల స్వామి, అమరావతి, ఉండవల్లి గుహలు, భవానీద్వీపం, కొండపల్లిఖిల్లా, నీరుకొండ మొదలైన ప్రాంతాలను రోడ్లు,జల మార్గాలు, మెటో్రరైళ్ళతో రాజధానికి కనెక్ట్ చేస్తారు.
200 అడుగుల వెడల్పయిన రోడ్లతోపాటు సైకిలింగ్ క అవసరమైన చిన్నదారులు కూడా వుంటాయి.2050 నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో వుంచుకునే నిర్మాణం జరుగుతుంది. ఆవసరాలను బట్టి విస్తరణ చేసుకోడానికి అనుగుణం గానే ప్లాన్ ను రూపొందించారు.
కాలువలు ప్రవహించే ఇటలీలోని వెనీస్ నగరం, అంతర్జాతీయ వాణిజ్య హబ్ అయిన అమెరికాలోని న్యూయార్క్ నగరం, ప్రపంచ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ కూడలి కాలిఫోర్నియా నగరాల రూపురేఖావిలాసాలను సమ్మిళితం చేసి వాస్తు శాసా్త్రన్ని జోడించి నిర్మించే నగరంగా నమూనా చిత్రాలను బట్టి అర్ధమౌతోంది. రద్దీపెరిగిపోయిన మలేషియా రాజధాని కౌలాలంపూర్ కి విస్తరణగా నిర్మిస్తున్న ”పుత్రజయ” , నిర్మాణం కావలసివున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి ”అమరావతి” కానె్సప్టులకు చాలా దగ్దరపోలికలు వున్నాయి.
”ఇది కేవలం ముసాయిదా దీన్నే యధాతధంగా నిర్మిస్తారనుకోవడం కరెక్టుకాదు. మన అవసరాలు, వాస్తవాలకు అనుగుణంగా ప్లాను మార్చుకుంటాము. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు రాజధానిలో ప్రతిబింబించాలన్నది ముఖ్యమంత్రిగారి ఆలోచనా, సూచనా” అని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

No comments:

Post a Comment