Friday, 24 July 2015

ఒవైసీవి మత రాజకీయాలు!

ఒవైసీవి మత రాజకీయాలు!
  • మెమన్‌కు ఉరిశిక్షపై వివాదం వద్దు: దత్తన్న
  • ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలి: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ‘యాకూబ్‌ మెమన్‌ ముస్లిం కాబట్టే ఆయనకు ఉరిశిక్ష విధించారు’ అన్న ఎంఐఎం అధినేత అసరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ‘‘మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయొద్ద్దు’’ అంటూ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ గట్టిగా స్పందించారు. ముంబై పేలుళ్ల దోషి అయిన మెమన్‌ విషయంలో వివాదం లేవదీయొద్దని ఒవైసీకి ఘాటుగా సూచించారు. ఇంత జరిగినా, ఇప్పటికీ ఎంఐఎం ఆలోచన మారకపోవడం ఆక్షేపణీయమని మంత్రి ఢిల్లీలో మండిపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలు ఉగ్రవాదులు, నేరస్థులకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్య తీసుకోవాలని టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. న్యాయస్థానం తీర్పునే వ్యతిరేకిస్తున్న ఎం ఐఎం పార్టీ గుర్తింపు రద్దుకు ఎన్నికల కమిషన్‌ ఆలోచన చేయాలన్నారు. దీని పై తాము ఈసీకి అప్పీలూ చేస్తామని హైదరాబాద్‌లో వెల్లడించారు. న్యాయవ్యవస్థపై గౌరవం లేని వారు పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ అన్నారు. ఉగ్రవాదానికి మతంతో ముడిపెట్టడంకంటే నీచమైన పనిలేదని ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ మండిపడ్డారు

No comments:

Post a Comment