Thursday, 10 September 2015

బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
Updated :09-09-2015 15:23:06
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. బుధవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీంజైదీ బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన వెల్లడించారు. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాకలు ఎన్నికలు జరుగునున్నాయి. నవంబర్ 29తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది.
 
ఎన్నికల సందర్భంగా 29 జిల్లాలు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలుగా, 47 సమస్యాత్మక నియోజవర్గాలుగా గుర్తించామని సీఈసీ తెలిపారు. ఎన్నికల్లో 6.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అక్రమ ఆయుధాలు, అక్రమ మద్యంపై నిఘా ఉంటుందన్నారు.
 
ఎన్నికల ముందు 48గంటల పాటు ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం విధించనున్నట్లు సీఈసీ తెలిపారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు. పోలింగ్‌కు 5 రోజుల ముందు ఓటర్ స్లిప్పుల పంపణీ జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గానికి రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఈసీ నసీంజైదీ తెలిపారు.
 
బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ :
- అక్టోబర్‌ 12న 49 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్‌
- అక్టోబర్‌ 16న 32 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌
- అక్టోబర్‌ 28న 50 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్
- నవంబర్‌ 1న 55 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్
- నవంబర్‌ 5న 57 నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్
- నవంబర్‌ 8న బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌

No comments:

Post a Comment