2017లో ‘తల మార్పిడి’ Updated :14-09-2015 01:10:23 |
బీజింగ్: మరో రెండేళ్లలో మనిషి తల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు చైనా వైద్యబృందం పేర్కొంది. జన్యుపరమైన లోపాలతో శరీరంలో తల మినహా మిగతా అవయవాలు సరిగా పనిచేయని వారిలో తలను మార్చే అవకాశం కోసం ఈ బృందం పరిశోధన చేసింది. తొలుత జంతువులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో మనుషులపై ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయత్నాల గురించి తెలుసుకున్న రష్యన్ సైంటిస్ట్ వాలెరి స్పిరిడొనోవ్ శస్త్రచికిత్సకు ముందుకొచ్చారు. అరుదైన జన్యు కండరాల వ్యాధి వెర్డింగ్ హాఫ్‌మన్ కారణంగా తల మినహా వాలెరి శరీరం సరిగా ఎదగలేదు. మరో రెండేళ్లలో.. అంటే 2017 డిసెంబర్‌లో శస్త్రచికిత్స ద్వారా వాలెరి తలను వేరుచేసి దాత దేహానికి అమరుస్తామని వైద్య బృందంలోని డాక్టర్ సెర్జియో కానవెరో పేర్కొన్నారు.
|
No comments:
Post a Comment