Thursday, 10 September 2015

సైకో బాధితురాలి పరిస్థితి విషమం

సైకో బాధితురాలి పరిస్థితి విషమం
Updated :10-09-2015 00:01:40
15 రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యం
 
నల్లజర్ల, సెప్టెంబరు 9: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో 15 రోజుల క్రితం సూది సైకో చే తిలో గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమం గా మారింది. ముక్కు, నోరు నుంచి రక్తం రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. గత నెల 26న గంటా చంటి అనే మహిళ నడిచి వెళుతుండగా, మోటారు సైకిల్‌పై వచ్చిన సూదిగాడు వెనుక నుంచి పొడిచి పరారయ్యాడు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి భయపడాల్సిందే మీ లేదని ఇంటికి పంపించేశారు. బుధవారం ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం రావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న చంటి అనారోగ్యం పాలవడంతో సైకో బాధితులతో పాటు జిల్లావాసుల్లోనూ భయాందోళనలు మొదలయ్యాయి.

No comments:

Post a Comment