Wednesday, 2 September 2015

పట్టిసీమకు వైసీపీ అనుకూలమా?వ్యతిరేకమా?: చంద్రబాబు

పట్టిసీమకు వైసీపీ అనుకూలమా?వ్యతిరేకమా?: చంద్రబాబు
Updated :02-09-2015 14:00:41
హైదరాబాద్, సెప్టెంబర్ 2: గోదావరి జిల్లాలకు రెండో పంటకు నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు అన్నారు. మూడో రోజు అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం మాట్లాడుతూ  పోలవరం పూర్తయ్యేలోపు సీలేరు ద్వారా రెండు పంటలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పట్టిసీమపై వైసీపీ వైఖరేంటో చెప్పాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలంటే ఎనలేని ప్రేమని, టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన గోదావరి జిల్లాలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమపై వైసీపీకి జిల్లాకో వైఖరి ఉందని చంద్రబాబు ఎద్దేవా  చేశారు.  చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు బాబుకు వ్యతిరెేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ చెప్పినా సభ్యులు వినకపోవడంతో ముఖ్యమంత్రి మరోసారి కల్పించుకుని వారి డిమాండ్లేంటో చెప్పాలని సూచించారు. రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అవకాశం కల్పించాలని వైసీపీ సభ్యులు స్పీకర్‌ను కోరారు. తప్పకుండా అవకాశం కల్పిస్తామని స్పీకర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

No comments:

Post a Comment