Wednesday, 2 September 2015

జగన్‌, హరీశ్‌ భేటీపై ఆధారాలున్నాయి: అచ్చెన్న

జగన్‌, హరీశ్‌ భేటీపై ఆధారాలున్నాయి: అచ్చెన్న
Updated :03-09-2015 02:12:49
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌, టీఆర్‌ఎస్‌ మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ భేటీ కావడంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మే నెలాఖరులో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అదే నెల 21న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లోని ఓ హోటల్‌లో జగన్‌, హరీశ్‌రావు, స్టీఫెన్‌సన్‌ కలిసి కూర్చుని మాట్లాడుకొన్నారు. స్టీఫెన్‌సన్‌ ద్వారా టీడీపీ వారికి ఎలా ఎర వేయాలనే విషయంపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ హోటల్లోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విషయం బయటకు వచ్చాక హోటల్‌ వారితో మాట్లాడి వాటిని తొలగించారు. అయినా మా వద్ద ఆధారాలు ఉన్నాయి. సమయం చూసి వాటిని బయట పెడతామ’’ని ఆయన పేర్కొన్నారు.
 
అలాగే ప్రత్యేక హోదా కోసం జగన్‌ దీక్షపై స్పందిస్తూ.. ‘‘మా ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పిచ్చోడు ఏదో చేస్తున్నాడని పట్టించుకోకుండా వదిలివేయడం.. లేదా సోనియాతో బెయిల్‌ ఒప్పందం కుదుర్చుకొని రాషా్ట్రనికి చేస్తూ వస్తున్న ద్రోహాలను ప్రజలకు గుర్తుచేస్తూ జగన్‌కు దీక్షలు చేసే హక్కు లేదని పోటీ దీక్షలు చేయడం’ అని వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment