Wednesday, 16 September 2015

‘రాజధానికి వ్యతిరేకంగా సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ’

‘రాజధానికి వ్యతిరేకంగా సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ’
Updated :15-09-2015 19:57:58
హైదరాబాద్, సెప్టెంబర్ 15: కేంద్రంలో ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటే వైసీపీ అధినేత జగన్ దూరాలని ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. మంగళవారం నారా లోకేష్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ నవ్యాంధ్ర రాజధానికి ఆటంకం కలిగిస్తూ సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని ఆరోపించారు. అయితే సింగపూర్ ప్రభుత్వం జగన్‌ లేఖలను చించిపక్కన పారేసిందన్నారు. తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. 95 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందేలా ప్రతీ పథకం అమలుచేస్తున్నామని వివరించారు.
 
రాజధాని, పట్టిసీమ, భోగాపురం ఎయిర్‌పోర్టులను.. అడ్డుకోవాలని ప్రయత్నించి జగన్‌ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బందరు పోర్టును వివాదం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలంటారు, పరిశ్రమలను అడ్డుకుంటారని జగన్ తీరును లోకేష్ ఎండగట్టారు. అభివృద్ధి విషయంలో అబ్దుల కలాం, ఎన్టీఆర్‌లను స్ఫూర్తిగా తీసుకుంటారు కానీ జగన్‌ను కాదని వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment