మేకపాలు... లీటరు 2వేలు! Updated :16-09-2015 01:24:20 |
ఢిల్లీలో లీటరు మేకపాల ధర ఒక్కసారిగా రూ.2 వేలకు దూసుకుపోయింది! డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడంతో మరణం సంభవిస్తుంది. వ్యాధిపీడితులకు మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందన్న సంప్రదాయ వైద్యుల సలహాతో జనం ఎగబడటమే ఇందుకు కారణం. అయితే, ఢిల్లీ పరిసర గ్రామాలతోపాటు గుడ్‌గాఁవ్‌లో అధికశాతం మేకలు చూడి దశలో ఉండటంవల్ల కొద్ది పరిమాణంలో మాత్రమే మేకపాలు లభిస్తున్నాయని పెంపకందారులు తెలిపారు. అందువల్లనే సాధారణంగా రూ.35-40 మధ్య పలికే లీటరు ధర ఒక్కసారిగా రూ.500 నుంచి 2వేలకు దూసుకుపోయిందని చెప్పారు.
|
No comments:
Post a Comment