Thursday, 10 September 2015

దళితులకు గ్రామ బహిష్కరణ...ఆందోళన

దళితులకు గ్రామ బహిష్కరణ...ఆందోళన
Updated :10-09-2015 12:46:34
తూ.గో, సెప్టెంబర్ 10 : రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు సామాజికవర్గాల మధ్య జరిగిన వివాదం ఓ సామాజిక వర్గాన్ని గ్రామం నుంచి వెలివేసే పరిస్థతి ఏర్పడింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఖాళీ స్థలంలో దేవాలయం నిర్మించేందుకు రెండు సామాజివర్గాలు శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్సీ సామాజికవర్గం నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
 
ఆగ్రహించిన రెండు సామాజిక వర్గాలు అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి చెత్తకుప్పల్లో పడవేశారు. ఈ ఘటనపై పోలీసులకు, ఉన్నతస్థాయి అధికారులకు ఎస్సీ సామాజిక వర్గం ఫిర్యాదు చేసింది. వెంటనే జోక్యం చేసుకున్న ఉన్నతాధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. దీనిపై ఆగ్రహించిన రెండు సామాజికవర్గాలు దళితులను గ్రామం నుంచి వెలివేశారు. తమ ఆదేశాలను వ్యతిరేకించిన వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో న్యాయం చేయాలంటూ దళితులు ఆందోళనకు దిగారు.

No comments:

Post a Comment