Monday, 21 September 2015

ఒక్క ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగమే మీవెంట..!

ఒక్క ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగమే మీవెంట..!
Updated :21-09-2015 12:06:08
  •  సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గం 
  • ఆన్‌లైన్‌ ఫిర్యాదుతో కదిలొచ్చే యంత్రాంగం 
  • 20 శాఖలకు అర్జీలు పెట్టే అవకాశం 
 ఎన్నాళ్లగానో మీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదా..? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని గ్రీవెన్స్‌కు వస్తున్నారా..! ఒక్క క్షణం.. మీరే మీ ప్రాంతం నుంచి మీ అర్జీని మీ కోసం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయండి.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది...!
 
గుంటూరు (నల్లచెరువు) 
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రజా సమస్యలు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిందే మీ కోసం పోర్టల్‌. అంతర్జాలం ద్వారా అర్జీదారులు నేరు గా వారి సమస్యలను ఒకే సారి మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. సమస్యలపై ప్రభుత్వాధికారుల బాధ్యతను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో దీని రూపకల్పనకు శ్రమించారు. దీని ద్వారా మా రుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సైతం ఆన్‌లైన్‌లో నేరుగా వారి సమస్య లు ఇవ్వడానికి వీలుంది.
  •  అర్జీలు సమర్పించడానికి మీ కోసం వెబ్‌ పోర్టల్‌లో నిర్థిష్ట విధి విధానాలు రూ పొందించారు. దీని ప్రకారం పౌరు లుఎవరైనా తొలుత డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ మీకోసం డాట్‌ ఏపీడాట్‌ గౌట్‌ డాట్‌ ఇన్‌లోకి వెళ్లాలి. 
  •  హోమ్‌ పేజీలో సిటిజన్‌ లాగిన్‌ అనే చోట సైన్‌ అప్‌ అవ్వాలి. ఇక్కడ ఫిర్యాదుదారుడి ఆధార్‌ సంఖ్య, చరవాణి సంఖ్య నమోదు చేయాలి. పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. అనంతరం సైన్‌అప్‌ వద్ద క్లిక్‌ చేయాలి. చరవాణికి వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. దీన్ని పోర్టల్‌లో నమోదు చేస్తే సైనప్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 
  •  ఇప్పుడు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు లాగిన్‌ అవ్వాలి. ఇందుకు ఆధార్‌ సంఖ్య, పాస్‌వర్డ్‌ సాయంతో లాగిన్‌ అవ్వొచ్చు. అనంతరం ఏ శాఖకు అర్జీ పెట్టాలో ఎంచుకోవాలి. 
  •  నిర్దేశించిన విధానంలో అర్జీలు నమోదు చేస్తే సంబంధిత శాఖకు అర్జీ వెళ్తుంది. 
  •  ప్రతి సమస్య పరిష్కారానికి ఇందులో నిర్థిష్ట కాల పరిమితి ఉంటుంది. 
  •  గడువు లోపు సమస్య పరిష్కారం కాకుంటే ఆటోమాటిక్‌గా పై అధికారి దృష్టికి వెళ్తుంది. 
  •  సలహాలకు సైతం ఇందులో అవకా శం ఉంటుంది. మీ కో సం బ్లాగులో పౌరులు ఎవరైనా ఆయా శాఖలకు సంబంధించి మార్పులు, చేర్పులు కావాలనుకుంటే వారి నుంచి సలహాలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. 
  •  సలహాలు వద్ద క్లిక్‌ చేస్తే నిర్దేశిత పేజీ వస్తుం ది. అందులో మీ పేరు, ఈ మెయిల్‌, చిరునామా, ఆధార్‌, చరవాణి నెంబర్లు నమోదు చేసి శాఖను ఎంచుకోవాలి. అందులో మీ సలహాలు, సూచనలు అందించేందుకు అవకాశం ఉంది. 
  •  తొలి విడతగా ఇందులో 20 శాఖల ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. 
  •  రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, విద్య, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, పట్టణ పురపాలిక, వ్యవసాయం, ఉద్యాన, పట్టు, మత్స్య, పశు సంవర్థక, మార్కెటింగ్‌, భూగర్భ జలాలు, గను లు,దేవాదాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, స్ర్తీశిశు సంక్షే మం, సహకార, హోం ఎనర్జీ శాఖలకు సంబంధించి న అర్జీలనునేరుగా ఆయా శాఖలకు పంపించవచ్చు. 
  •  మీరు జిల్లా కేంద్రానికి వచ్చినా అధికారులు మీ అర్జీలు తీసుకుని ఇందులోనే నమోదు చేసి పరిష్కారం కోసం కింది స్థాయి అధికారులకు పంపుతారు. 
  • ఫ ఇందులో అర్జీలను సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులు పరిశీలించి అపరిష్కృత అర్జీలపై కాన్ఫరెన్స్‌ నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. 
  •  మరిన్ని వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1100 లేదా 1800 425 4440 నెంబర్ల నందు సంప్రదించవచ్చు.
గ్రీవెన్స్‌ భారం ఇదీ.. 
  •  జిల్లా కేంద్రం గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య సగటున : 500
  •  అర్జీదారులంతా చార్జీల కోసం వెచ్చిస్తున్న మొత్తం : రూ.50 వేలు 
  •  టీ, టిఫిన్స్‌, భోజనం వంటి వాటి కోసం చేస్తున్న ఖర్చు : రూ. లక్ష 
  •  ఒక్క అర్జీదారుడు వెచ్చిస్తున్న సమయం : 8 గంటలు 
  •  సగటున ఒక్కో ఆర్జీదారుడు ఇచ్చే అర్జీల సంఖ్య : 3 లేక 4 సార్లు 
  •  జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు వెచ్చిస్తున్న సమయం : 5 గంటలు

No comments:

Post a Comment