- 40 శాతం పెరగనున్న కేంద్ర ఉద్యోగుల వేతనాలు
- డీఏ 120 శాతం పెరిగే అవకాశం
- నవంబర్‌లో ఏడో వేతన సంఘం నివేదిక
- వచ్చే జనవరి నుంచి అమలులోకి సిఫారసులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. ఏడో వేతన సంఘం నివేదిక ప్రకారం.. ఈ సారి వేతనాలు 40 శాతం, కరువు భత్యం (డీఏ) 120 శాతం మేర పెరగనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పదేళ్లకు ఓసారి కేంద్ర ఉద్యోగుల వేతనాలను సవరించేందుకు ఏర్పాటైన ఏడో వేతన సంఘం.. ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయనుంది. సుమారు 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్లు ఏడో వేతన సంఘం సిఫార్సుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వేతన సవరణకుగాను ఆరో వేతన సంఘం అనుసరించిన విధానాలనే మాఽథూర్ సంఘం కూడా ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది జూలై 1 వ తేదీకి ఇంక్రిమెంట్, రెండు సార్లు డీఏల పెంపును పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి వేతన సంఘం తీపి కబురునే ఇవ్వనున్నట్లు సమచారం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల పట్టిక, ద్రవోల్బణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న వేతన సంఘం సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. ఇంక్రిమెంట్ కూడా ఏడాదికి 3శాతం నుంచి 5శాతం వరకూ సిఫారసు చేయనుంది. ఈసారి కొత్త పే బ్యాండ్‌లకు అనుగుణంగా గ్రేడ్ పేలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు.. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వేతన విధానంపైన, ఉద్యోగుల డీఏల పెంపుపైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీలుగా శాశ్వత వేతన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని మా ఽథూర్.. సిఫార్సు చేయనున్నారు. డీఏను బేసిక్‌పేతో విలీనం చేసే అంశాన్ని కూడా ఇది పరిశీలిస్తున్నట్లు తెలిసిం ది. పే బ్యాండ్ -2, 3 పరిధిలోకి వచ్చే రూ.5400 గ్రేడ్ పే విషయంలో ఉద్యోగుల అభ్యంతరాలకు అనుగుణంగా నూతన వేతన సంఘం సిఫార్సులు ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. కాగా, కేంద్ర వేతన సంఘం ఇచ్చే సిఫారసుల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఉద్యోగులకు వేతనాలను పెంచడం ఆనవాయితీగా వస్తోంది.
|
No comments:
Post a Comment