Friday, 11 September 2015

వజ్రాల సాగులో మోసమే దిగుబడి!

వజ్రాల సాగులో మోసమే దిగుబడి!
Updated :11-09-2015 02:21:03
‘వజ్రాల సాగు’ చేసినా రైతుకు మిగిలేది కౌలు మాత్రమే! ‘వజ్రాల దిగుబడి’ సాధించినా చివరకు దక్కేది మోసమే! కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఎన్‌.రంగాపురంలో జరుగుతున్న దందా ఇది! ఇప్పటి వరకు ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఏడాది కిందట కురిసిన వర్షాలకు వజ్రాలు దొరికాయి. దాంతో ఈ ఏడాది వర్షాలు కురవగానే వ్యాపారులు, దళారులు వాలిపోయారు. విజయవాడ, వినుకొండ, ఒంగోలు, అనంతపురం, పెరవలి తదితర ప్రాంతాల నుంచి వజ్రాల వ్యాపారులు ఆ గ్రామానికి క్యూ కట్టారు. రైతుల నుంచి పొలాలు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది కౌలుకు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కూలీలను పెట్టుకుని వజ్రాల అన్వేషణ సాగిస్తున్నారు. ఒకవేళ రైతుకే వజ్రాలు దొరికినా వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 వజ్రాలకుపైగానే దొరికాయి. వీటిలో ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన వజ్రాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఎంత విలువైన వజ్రమైనా గుత్తగా లక్ష రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment