|
- Achievements of the Department of Social Justice & Empowerment in one year
- Berger Paints' Q3 profit decline marginally to Rs 82 crore
- James Horner's most famous tracks
- Berger Paints plans to set up industrial coatings plant in Russia
- Dodge this
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
|
|
మనది ఆనంద ఆంధ్ర ‘‘భారతదేశంలో గొప్ప కుటుంబ వ్యవస్థ ఉంది. అమెరికాలో 20 ఏళ్లకే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. 60-70 ఏళ్లలో ఒంటరి బతుకు. చైనాలో కుటుంబ నియంత్రణ తర్వాత కొంత మార్పు వచ్చింది. అక్కడ కొన్ని సమస్యలున్నాయి. జపాన్‌లో వృద్ధాప్య సమస్య మొదలైంది. యువకులు లేరు. మాట్లాడాలన్నా, మందులు వేసుకోవాలన్నా రోబోట్లతోనే! మనకు ఆ పరిస్థితి లేదు. ఇంటికెళ్లేసరికి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ హాయిగా ఆహ్వానిస్తారు. అందరం కలిసి ఉంటాం. ఇది మన గొప్పతనం’’ అని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల బాగా చదువుకున్న పిల్లలు పెళ్లిళ్ల తర్వాత స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటున్నారని, తల్లిదండ్రులను వదిలేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ‘‘ఎంత సంపద ఉన్నా.. ఎన్ని సౌకర్యాలున్నా ఆనందముండాలి. కొందరు బంగారు కుర్చీలు, మంచాలు కూడా చేయించుకుంటున్నారు. పడుకోవడానికి గట్టిగా ఉండచ్చు ఉపయోగమేముంది? కొన్ని దేశాలకు సంపద ఉంది. కానీ, మనకున్న ఆనందం వాళ్లకు లేదు’’ అని చెప్పారు. |
|
|
|
|
న్యూ ఢిల్లీ, జులై 23: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. సుష్మా స్వరాజ్ లలిత్ మోదీకి సహకరించారని ఆరోపించారు.
|
|
రాజమండ్రి, జూలై 23 : పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్ ఆరోపించారు.
|
|
|
|
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో వక్ఫ్ భూములు అన్యా క్రాంతం కాకుండా పరిరక్షించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ స్థానిక అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, మైనార్టీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బా ల్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని సర్వే నెంబర్ 234 నుంచి 245 వరకు, నెంబర్ 247లలో 180 ఎకరాలు, పెదకాకాని మండలంలోని వెనిగళ్ళలో 50.68 ఎకరాలు, నల్లపాడులో 9 ఎకరాలు, పేరేచర్లలో 8 ఎకరాలు మేర విలువైన వక్ఫ్ భూములున్నాయన్నారు. నగరానికి సమీపంలో ఆ భూములున్నందున వాటిని ఆక్రమణదారులు కబ్జా చేసే అవకాశం ఉంటుందన్నారు. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్‌తో పాటు స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌వోలు ఒక బృందంగా ఏర్పడి ప్రతీ శుక్రవారం భూములను తనిఖీ చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలన్నారు. మైనార్టీలలో పేద మహిళల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం దుల్హన్ పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. జిల్లాలో మైనార్టీల సంక్షేమ పథకాల అమలు కోసం రూ. 70 లక్షల సబ్సిడీ అందుబాటులో ఉందని, దానిని వినియోగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌నాయుడు, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 24వ తేదీలోపు కాల్‌డేటా సమాచారాన్ని సమర్పించాలంటూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిసే్ట్రట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల సీడీఆర్‌ను భద్రపరచాలని, తెలంగాణ అధికారులు రాసిన లేఖలు ఇవ్వాలని, ట్యాపింగ్ జరగకపోతే అదే విషయాన్ని తెలియజేయాలంటూ ఈనెల 17న విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ సహా పలు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు బుధవారం ప్రస్తావించారు. కేసు తీవ్రత దృష్ట్యా, ఆదేశాల అమలుకు మరో రోజు మాత్రమే గడువు ఉన్నందున తక్షణం దీనిపై విచారణ జరపాలని, కింది కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
|
|
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరం పొడవునా ఆకాశహార్మ్యాలు దర్శనమివ్వనున్నాయి. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని ఏపీ సర్కార్ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా నదీ తీరం పొడవునా బహుళ అంతస్థుల నివాస సముదాయాల నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో చోటు కల్పించారు. ఈ భారీ అపార్టుమెంట్లను నిర్మించే బాధ్యతను తీసుకునేందుకు సింగపూర్ డెవలపర్లు ముందుకొస్తున్నారు. సుమారు 17 చదరపు కిలోమీటర్ల మేర ఆకాశహార్మ్యాల నిర్మాణానికి బిడ్ వేసేందుకు సింగపూర్ టౌన్‌షిప్ డెవలపర్లు సిద్ధమవుతున్నారు. ఇది ఒకే అయితే, దక్షిణ భారత దేశంలో వీరు నిర్మించే మూడో టౌన్‌షిప్ ఇదే అవుతుంది. ఏపీ రాజధాని నగరం సుమారు 7వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రాజధాని నగరం నడిబొడ్డున అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఇతర ప్రభుత్వ పాలనా విభాగాల కోసం భవంతులు నిర్మిస్తారు. ఈ భవంతుల నడుమ నివాస, వాణిజ్య భవనాలూ ఉంటాయి. వీటిలో నివాస సముదాయాలను నిర్మించేందుకు సింగపూర్ డెవలపర్లు ముందుకు వచ్చారు. అమరావతిలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో సగర్వంగాప్రకటించింది. మరోవైపు తాము ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేసే డెవలపర్‌ను ఎంపిక చేసుకునే బాధ్యత ఏపీ సర్కార్‌దని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. సింగపూర్ టౌన్‌షిప్ డెవలపర్లు చైనా, వియత్నాంలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచారని, వారి సేవలనూ ఏపీ సర్కార్ వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. అసెండస్ సింగ్ బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ వంటి సంస్థల సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో భవనాల నిర్మాణంలో తాము ముందంజలో ఉన్నామని సెంబ్‌కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ టో వివరించారు. భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో 11వేల హెక్టార్లలో 3,300 మెగావాట్ల థర్మల్, సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ప్లాంట్లను నిర్మించామన్నారు. ఇందులో ఏపీ కూడా ఉందన్నారు.
అమరావతిలో ప్రధాన రహదారులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సర్కార్ భావిస్తోంది. సింగపూర్ బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ‘కృష్ణ’ పేరు మీద పిలిచే కృష్ణాతీర రహదారి రాజధాని నగరంలో 3.8 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. దీనికి మధ్యలో ఒక వంతెన వస్తుంది. మొత్తం సీడ్ క్యాపిటల్‌లో ఇది కీలకం కానుంది. దీనికి ఒక పక్కన నది, మరో పక్కన వివిధ పర్యాటక ఆకర్షణలు, రెస్టారెంట్లు రానున్నాయి. దీనికి బస్‌రాపిడ్ విధానం, రైలు మార్గాలు అనుసంధానమై ఉంటాయి. 1.6కిలోమీటర్ల పొడవైన కేంద్ర రహదారి మరో ఆకర్షణ కానుంది. ఢిల్లీలో ఇండియా గేట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌వరకూ ఉన్న విశాలమైన రహదారి తరహాలో ఉంటుంది. నగరం మధ్యలో రద్దీ తగ్గింపుతోపాటు పెద్ద ఆకర్షణగా దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వాణిజ్య ప్రాంతాన్ని అంతర్జాతీయ పరిభాషలో డౌన్‌టౌన్ అంటారు. ఇందులోని రహదారులను వీలైనంత వరకూ పాదచారులకు పరిమితంచేసే ప్రతిపాదన ఉంది. వీటికి అనుబంధంగా ఉన్న రహదారుల్లోకి వాహనాలను అనుమతిస్తారు. ఆకాశహర్మ్యాలు, అత్యాధునిక వాణిజ్య సముదాయాలు డౌన్‌టౌన్‌లో వస్తాయి. దేశంలోనే తొలిసారిగా వాటర్ టాక్సీలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అమరావతిలో వాటర్ టాక్సీల విస్తృత వినియోగానికి ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. ఈ రాజధాని ప్రాంతం కృష్ణా నదికి అభిముఖంగా వస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఒక పాయను ప్రత్యేకంగా నగరంలోకి తీసుకువచ్చి అది మళ్లీ నదిలో కలిసే ఏర్పాటు చేస్తున్నారు. నదిలోను, అలాగే ఈ పాయలోను వాటర్ టాక్సీలను నడుపుతారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు బాగా దగ్గర్లో ఈ ట్యాక్సీ స్టేషన్లు కూడా ఉంటాయి. రాజధానిలో హైస్పీడ్ రైలు, బస్ రాపిడ్ సిస్టం, వాటర్ టాక్సీలను ఏర్పాటు చేస్తు న్నారు. ప్రత్యేక నిర్మాణశైలిలో భవనాలు రాజధానిలో భవనాలు చూడముచ్చటగా కనిపించే నిమిత్తం ఆర్కిటెక్చర్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ భవనాలను ఆధునిక, సంప్రదాయ శైలి సమ్మేళనంతో నిర్మించనున్నారు. భవనాల్లో కొన్నింటిని లాండ్ మార్క్ నిర్మాణాలుగా ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. అమరావతి గేట్ వే, కొన్ని ప్రముఖ ప్రభుత్వ భవనాలు ఇలా లాండ్ మార్క్ భవనాలుగా ఉండనున్నాయి. ఆకాశహర్మ్యాలు, పరిమిత అంతస్తుల భవనాలు కలిసి ఉండేలా చూస్తున్నారు. సీడ్ క్యాపిటల్ నగరం సరిహద్దులను చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో ప్రాథమికంగా ఖరారుచేశారు. ఉండవల్లి గుహలనుంచి అమరావతి గ్రామం మధ్యవరకు సీడ్ క్యాపిటల్ ఉంటుంది. విజయవాడ-గుంటూరు రహదారిలో ప్రకాశం బ్యారేజి దాటాక కొంత దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. దాని పక్క నుంచి తుళ్లూరు మీదుగా అమరావతికి ప్రస్తుతం ఒక రోడ్డు ఉంది. |
|
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచేలా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో ఏపీ కేబినెట్ సమావేశమైంది.ఈ సమావేశంలో పలు అంశాలపై 4 గంటలపాటు చర్చించారు. పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఇప్పుడు రాజమండ్రిలో పెట్టినట్లే మున్ముందు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా మంత్రివర్గ సమావేశాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సింగపూర్, జపాన్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని, దీనివల్ల రాజధాని నిర్మాణానికి నిధుల సమస్య ఉండకపోవచ్చునని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేబినెట్ సమావేశంలో సింగపూర్ ప్రభుత్వం తాజాగా సమర్పించిన సీడ్ క్యాపిటల్ ప్రణాళికపై చర్చ జరిగింది. ప్రణాళిక బాగుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తదుపరి కార్యాచరణ గురించి కూడా చర్చ వచ్చింది. ‘‘ప్రభుత్వానికి...ప్రభుత్వానికి మధ్య ఒప్పందం పేరుతో మనం సింగపూర్, జపాన్ ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని రాజధాని నిర్మాణం వాటికి అప్పగించవచ్చు. కానీ పారదర్శకంగా ఉండాలన్న అభిప్రాయంతో స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి అభివృద్ధి భాగస్వామిని ఎంపిక చేయాలని నిర్ణయించాం. భాగస్వాములుగా సింగపూర్, జపాన్ ఎంపికైతే మనకు హాయిగా ఉంటుంది. వాళ్ల వద్ద నిధులున్నాయి. అంతర్జాతీయ అనుభవం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. స్విస్ చాలెంజ్ ప్రక్రియలో పాల్గొనాలని మనం ఆ రెండు దేశాలకూ విజ్ఞప్తి చేద్దాం. వారితోపాటు ఇందులో పాల్గొనడానికి ఇతరులకు కూడా అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు మించిన మంచి ప్రతిపాదనతో మరెవరైనా వస్తే వారికైనా అవకాశం ఇద్దాం. మనకు మంచి రాజధాని త్వరితంగా నిర్మాణం కావాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయానికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపికైతే ఈ సంస్థలో 50 శాతం వాటా తీసుకోవడానికి సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాము ఎంతపెట్టుబడి పెట్టాలో.. దానిని ఎలా రాబట్టుకోవాలో కూడా సింగపూర్ సంస్థలు వాణిజ్యపరమైన అంచనాలు కూడా తయారు చేసుకొన్నాయని, తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి రాజధాని ప్రాంతంలో మూడు వేల ఎకరాలు ఇస్తే దానిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని ఆ సంస్థలు ప్రాథమిక చర్చల్లో సంకేతాలు ఇచ్చాయని కూడా ఆయన చెప్పారు. వినోదపరమైన సంస్థలు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు జపాన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెడితే అవి సురక్షితంగా ఉండటంతోపాటు అవి తమకు తిరిగి వస్తాయన్న నమ్మకం వారిలో కలిగించగలిగామని ఆయన వివరించారు. 2018 సంవత్సరం నాటికి కొత్త రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, దానివల్ల రాజధానికి ఒక రూపు వస్తుందని ఆయన వివరించారు. రాజధానిలో ఉద్యోగుల గృహ నిర్మాణంపై కూడా చాలా ఆలోచనలు చేస్తున్నామని, ఎల్ ఐసీ నుంచి కేంద్రం ద్వారా రుణం తీసుకొని ఉద్యోగుల కోసం 30 వేల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీ సూచన మేరకు పాత సోవియట్ రష్యా పరిధిలోని తజకిస్తాన్, కజకిస్తాన్ దేశాలు కొత్తగా నిర్మిస్తున్న వాటి రాజధానుల పరిశీలనకు ముందు అధికారుల బృందాన్ని పంపి ఆ తర్వాత అవసరం అనుకొంటే తాను...మంత్రులు కలిసి చూసి వస్తామని చంద్రబాబు తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడంపై దృష్టి పెట్టి మంత్రులు పనిచేయాలని, దశలవారీగా తరలింపు చేపట్టాలని కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘విభజన చట్టంలో దీనిపై పూర్తి స్పష్టత ఉంది. కొత్త రాజధానిలో హైకోర్టు భవన నిర్మాణం జరిగిన తర్వాతే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి కొత్త హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుంది. అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న ఏర్పాటే కొనసాగుతుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏడాదిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన
పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా తిప్పించుకొంటూ వేధిస్తున్నారన్న కారణంతో ఇటీవల ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాల నుంచి ప్రజలు మొత్తం 61 రకాల సర్టిఫికెట్లు పొందాల్సి వస్తోందని ఆయన ఆ జాబితాను మంత్రులకు చదివి వినిపించారు. ‘‘ఈ పరిస్థితి నుంచి ప్రజలను తప్పించాలి. ఏ సర్టిఫికెట్ కోసం ప్రజలు రెవెన్యూకార్యాలయం గడప తొక్కాల్సిన అవసరం లేకుండా చేయాలి. భూ వివరాలను పూర్తిగా వెబ్ లాండ్ వెబ్‌సైట్లో నమోదు చేసి ఎవరైనా నేరుగా దాని నుంచి వివరాలు పొందగలిగే పరిస్థితి తేవాలి. దీని కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కనీసం ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా సమావేశమై ఈ వ్యవస్థను పూర్తిగా క్షాళన చేయాలి’ అని ఆయన ఆదేశించారు. ఇటీవల ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక తరలింపుపై ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు మధ్య నెలకొన్న వివాదంపై కూడా చర్చ జరిగింది. ‘ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వెంటనే ఆందోళన కూడా ప్రకటించారు. నేను జపాన్ నుంచి వచ్చిన తర్వాత విచారణ చేయిస్తే తప్పు ఎమ్మార్వోదేనని తేలింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోకి వెళ్లి వాహనాలు ఆపారు. అది ఆమె పరిధి కాదు. టీడీపీ ఎమ్మెల్యేది కూడా తప్పే. ఆయన ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండాల్సింది. కృష్ణా జిల్లా కలెక్టర్ దీనిపై సరిగా స్పందించకపోవడంతో వివాదం పెద్దదైంది. ఆ జిల్లా మంత్రి ఉమా మహేశ్వరరావు కూడా మౌనం వహించారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు.
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయించారు. ‘‘వాళ్లు ముందు విధుల్లో చేరితే వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి నేను సిద్ధం. ఉద్యోగులకు నేను చాలా చేశాను. అయినా సమ్మెకు దిగడం ఏమిటి? మీరు వాళ్లతో మాట్లాడి ముందు విధుల్లో చేరమని చెప్పండి’’ అని మంత్రులకు సూచించారు. విశాఖ, విజయవాడల్లో 101 పద్దు కింద కిందకు మునిసిపల్ సిబ్బందిని చేరిస్తే వారి సమస్య తీరుతుందని ఒక మంత్రి చెప్పినప్పుడు దానికేమీ ఇబ్బంది లేదని, కాని ముందు సమ్మె విరమించాలన్నారు.
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని మాకు బయటి నుంచి సమాచారం వస్తోంది. దీనిపై విచారణ జరపాలి’’’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భవనాల క్రమబద్ధీకరణ పథకం ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. |
|
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్ర జ్యోతి): ‘‘మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా? తెలంగాణ సమాజం అంటే అంత చిన్న చూపా? మమ్మ ల్ని స్వతంత్రంగా పరిపాలించుకోనివ్వరా. ఎందుకు అంత అక్కసు, బాధ. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు’’ అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ రాజధానిని బాగా నిర్మించుకోండి. మాకు సంతోషం. కానీ హైదరాబాద్‌తో పోటీ ఎందుకు? లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌తో అమరావతికి పోటీయా? పద్ధతి మార్చుకో’’ అని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ అస్తిత్వం గురించి పద్యాల ద్వారా ప్రపంచానికి చాటిన మహాకవి దాశరథి అని కొనియాడారు. మాతృభూమిని తల్లిగా భావించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని దాశరథి ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి వారి చరిత్ర మరుగున పడిందని అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ, ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు’’ అంటూ మూడురోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ‘‘నన్ను అంటే భరిస్తానుగానీ.. తెలంగాణ సమాజాన్ని ఏమైనా అంటే సహించేది లేదు. మాకు ఉండేదేదో ఉంది. లేనిదేదో లేదు. మా పాలన మేం చేసుకుంటున్నాం. మీకు అంత అక్కసు, బాధ ఎందుకు? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. నిద్ర లేవడాన్ని మీరు నేర్పారా? దీన్ని కవులు, కళాకారులు ఖండించాలి. ఇదేమి సంస్కారం. కేసీఆర్‌ను అంటే పడతాను. కానీ, తెలంగాణ సమాజాన్ని అంటే ఊరుకునేది లేదు. ఇది హెచ్చరిక. రీతి లేని పత్రికలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వెకిలి రాతల్ని వండి వారుస్తున్నాయి. ఆంధ్రా రాజధానిని బాగా కట్టుకోండి. అయితే.. హైదరాబాద్‌తో అమరావతికి పోలికేంటీ? హైదరాబాద్ గొప్ప చరిత్ర ఉన్న నగరం. దీని విస్తీర్ణం 18.30 లక్షల చదరపు ఎకరాలు. ఫారెస్ట్‌కు వదిలినదే 1.50 లక్షల ఎకరాలు ఉంది. అమరావతికి, హైదరాబాద్‌కు ఏ రకంగా పోలిక? ఆంధ్రప్రదేశ్‌లోని మేధావులు కూడా ఆలోచించాలి. సినారే వంటి మేధావులు ఇక్కడ ఉన్నారు. ఆయనకు పోటీ ఉందా? ఎవరి ప్రతిభ వారికి ఉంటుంది. ఇప్పటికైనా బాబు భ్రమను వీడాలి. ఆంధ్రప్రదేశ్ పాలనపై దృష్టి పెట్టాలి. మీరు ఒకటి అంటే...మేం పది అంటాం. ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలి. లేదంటే మర్యాద ఉండదు.’’ అని తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ చారిత్రక నగరమని.. హైదరాబాద్ రాజధాని కావడం తెలంగాణ అదృష్టమని అన్నారు. తెలంగాణలోని కవుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని, దీనిపై త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్యకు ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. రూ. ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు, మొమెంటో, శాలువాతో శ్రీనివాసాచార్యను ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన రచించిన బంగారు తెలంగాణ పాటల పుస్తకం, సీడిలను కూడా ఆవిష్కరించారు. దాశరథి విశ్వకవి అని ఈ సందర్భంగా శ్రీనివాసాచార్య కీర్తించారు. ‘‘సినారె కవిత్వం జగన్మోహనం.. దాశరథి కవిత్వం విద్వత్వం’’ అని కొనియాడారు. ఇక.. ఏ గడ్డమీదైతే తెలంగాణ డైనమిజం అణచివేతకు గురైందో అదే గడ్డ మీద తెలంగాణ కవులను గౌరవించుకుంటున్నామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ డైనమిజాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి పలు కవితలు చదివారు. సీఎం కేసీఆర్ గురించి రాసిన కవితలు చదివి ఆయనకు అంకితమిచ్చారు. కేసీఆర్ చింత అంతా తెలంగాణనే అన్నారు. తెలుగు వర్సిటీ వీసీ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక విద్వత్తు-విద్యుత్తు.. అనే రెండు అంశాలపై దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ తల్లిని మొట్టమొదట కీర్తించిన కవి దాశరథి అని.. దాశరథి బలమంతా తెలంగాణ అని. సీఎంవోలో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా.. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, సాంస్కృతిక సారథి చైరన్ సమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
1 రాయపూడి వద్ద: అసెంబ్లీ, సచివాలయం
2 బోరుపాలెం సమీపంలో: పౌర సేవల కేంద్రం 3 అబ్బురాజుపాలెంలో: రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు 4 దొండపాడులో: స్టేట్ గ్యాలరీ 5 బోరుపాలెం పరిధిలో కృష్ణా నది ఒడ్డున: సివిక్ ప్లాజా 6 లింగాయపాలెం ప్రాంతం 7 కొండమరాజుపాలెం పరిధిలో: హాస్పిటాలిటీ నోడ్ 8 కొండమరాజుపాలెం, తుళ్లూరు మధ్య: ప్రాంతీయ ఆసుపత్రి 9 ఉద్దండ్రాయినిపాలెం ప్రాంతం 10 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి సమీపాన: కెనాల్ పార్కులు 11 రాయపూడి సమీపంలో నది పక్కన: బొటానికల్ గార్డెన్ 12 లింగాయపాలెం సమీపంలో నది పక్కన: బొటానికల్ జట్టి 13 ఉద్దండ్రాయినిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో: వాణిజ్య ప్రాంతం 14 తాళ్లాయపాలెం ప్రాంతం 15 వెంకటపాలెం మిట్ట భూముల్లో: విశ్వవిద్యాలయం 16 ఉండవల్లికి సమీపంలో: గేట్‌వే టౌన్ 17 వెంకటపాలెం జరీబు భూముల్లో: వెట్‌ల్యాండ్ పార్కు 18 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం సమీపంలో కరకట్టకు దిగువన: సాంస్కృతిక కేంద్రం 19 తాళ్లాయపాలెం నది ఒడ్డున: కళా కేంద్రం 20 తాళ్లాయపాలెం లంక భూముల్లో: జట్టి డౌన్ టౌన్ 21 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు దిగువన: డౌన్‌టౌన్ కోర్ 22 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు ఎగువన: ఐకానిక్ టవర్ 23 ఉద్దండ్రాయినిపాలెం దగ్గరలో: ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్ 24 ఉద్దండ్రాయినిపాలెం రేవు సమీపంలో: ఆహారశాలలు 25 ఉద్దండ్రాయినిపాలెం లంక భూముల్లో: గోల్ఫ్ కోర్స్ 26 లింగాయపాలెం సమీపంలో నది ఒడ్డున: కన్వెన్షన్ సెంటర్ 27 తాళ్లాయపాలెం సమీపంలో నది ఒడ్డున: విహార కేంద్రం |
Highfields - GOHF Offers |
Free Modular Kitchen worth Rs.3 Lac And 2 Year Pre-EMI Offer. Book Now! gohf.magicbricks.com |
Ads by Google |
Facebook® Account Sign Up |
Connect With Your Friends Online. Join the Facebook Community - Free!facebook.com |
Ads by Google |
MAIL