Monday 5 May 2014

రాష్ట్ర విభజనపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

రాష్ట్ర విభజనపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ, తదుపరి విచారణ ఆగస్టు 20కు వాయిదా, ఉండవల్లి వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం

Published at: 05-05-2014 13:38 PM
న్యూఢిల్లీ, మే 5 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు  అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన 24 పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేల త్రిసభ్య ధర్మాసనం  విచారణ జరిపింది.  ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని కోర్టు తేల్చిచెప్పింది. పూర్తిస్థాయి విచారణ తర్వాతే స్టే పైన నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
అపాయింటెండ్ డేట్ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును కోరారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని ఆయన   కోక్టుకు విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి దత్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును చేపల మార్కెట్ చేయవద్దన్నారు.  విభజన అంశంపై  పిటిషన్ దాఖలు చేసినవారిలో రాష్ట్రానికి చెందిన 23 మందితోపాటు ఢిల్లీ న్యాయవాది మనోహర్‌లాల్ శర్మ కూడా ఉన్నారు.

No comments:

Post a Comment