Saturday 3 May 2014

స్కామాంధ్ర - స్వర్ణాంధ్ర - మోదీ

దేశం,రాష్ట్రాన్ని లూటీ చేసిన వారికి ఓటువేయొద్దు స్వర్ణాంధ్ర కావాలో..కావాలో తేల్చుకోండి మదనపల్లె సభలో మోదీ

Published at: 01-05-2014 13:26 PM
చిత్తూరు, మే 1 : దేశం, రాష్ట్రాన్ని లూటీ చేసిన వారికి ఓటు వేయొద్దని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ప్రజలకు సూచించారు. గురువారం ఉదయం జిల్లాలోని మదనపల్లె సభలో పాల్గొన్న మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. పవిత్రమైన భూమి రాయలసీమ అని అభివర్ణించారు.
రవీంద్రుడు జనగణమన రాసింది ఇక్కడే అని కొనియాడారు. రాయలసీమ అబివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్న ఆయన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలో...స్కామాంధ్రగా కావాలో ప్రజలు తేల్చుకోవాలని మోదీ అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. జీవనోపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ వెలుతున్నారని, అరబ్ దేశాలకు వెళ్లే వారికి రక్షణ కల్పిస్తామన్నారు.
ఇటలీ ఆవిర్భావం దినం రోజే రాష్ట్ర విభజన డేను నిర్ణయించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల ఎన్నికల్లో తల్లీకొడుకుల పార్టీ గల్లంతైందని ఆయన ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం జరిగితే సీమకు ఎంతో లాభమని, సాగునీరు వస్తే సీమలో సిరులు పండుతాయన్నారు.
నదులను అనుసంధానం చేసి తీరుతామని మోదీ స్పష్టం చేశారు. సీమాంధ్ర కు అధునాతన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్కాం ఇండియాను స్కీం ఇండియాగా మారుస్తామని, మీ చేతుల్లోనే సీమాంధ్ర భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. తనది, బాబుది అభివృద్ధి ఎజెండా అని నరేంద్ర మోదీ వెల్లడించారు.

No comments:

Post a Comment