Saturday 3 May 2014

అధికారంలోకి వచ్చేవారికే కేంద్రంలో మద్దతిస్తాం

అధికారంలోకి వచ్చేవారికే కేంద్రంలో మద్దతిస్తాం

Published at: 04-05-2014 05:05 AM
రాష్ట్రానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా
చంద్రబాబే బెల్ట్ షాపుల సృష్టికర్త: జగన్
రానున్నవి మంచిరోజులు: విజయలక్ష్మి
జగ్గయ్యపేట/పి.గన్నవరం/విజయనగరం/విశాఖపట్నం, మే 3: కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి.. రాష్ట్రానికి నిధులు తెస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, విశాఖ సభల్లో ఆయన మాట్లాడుతూ టీడీపీ మానిఫెస్టోలోని హామీలు నేరవేర్చేందుకు చంద్రబాబు జీవితం సరిపోదని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రకటించిన రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వటానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారాన్ని పొందాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు పూర్తైన గంటలోనే చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌లు మాటమార్చారని, వారి దిగజారుడు రాజకీయాలకిదే నిదర్శనమన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం బంగారం లాంటి రాష్ట్రాన్ని చీల్చారని, తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక ్తం చేశారు. పేదవాడి గుండెచప్పుడు వినే నాయకుడినే ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నాయకుడు చనిపోయినా పేదవాడి గుండెల్లో పదిలంగా ఉండేలా పనులు చేయాలని జగన్ అన్నారు. మనం వేసే ఓటుతో మన తలరాతలు మారనున్నాయని చెప్పారు. విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలకు ముందు మద్యనిషేధం అంటాడు.. ఎన్నికల తర్వాత బెల్టుషాపులు పెట్టిస్తాడని చంద్రబాబును జగన్ ఎద్దేవా చేశారు. బెల్టుషాపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడని ఆరోపించారు. ఐటీ ఎగుమతులు పెంచేందుకు విశాఖలో ఐటీ ఎక్స్‌పోర్టుజోన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. విశాఖలో కాలుష్య సమస్య పరిష్కరించి క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ సీమాంధ్రలో రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. దుష్ట కాంగ్రెస్ పాలన అంతమొందుతుందని, త్వరలోనే సీమాంధ్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పారు.
 

No comments:

Post a Comment