Saturday 10 May 2014

కాంగ్రెస్, టీఆర్ఎస్ డూప్ ఫైట్

కాంగ్రెస్, టీఆర్ఎస్ డూప్ ఫైట్

Published at: 11-05-2014 03:55 AM
కేసీఆర్ వ్యాఖ్యలతో స్పష్టం
వైసీపీ, టీఆర్ఎస్ బంధం దృఢమైనది
కాంగ్రెస్‌ది నీచ రాజకీయం
ఎన్డీయేకి 300 సీట్లు తథ్యం
17న ప్ర««ధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
రెండు రాష్ట్రాల్లో టీడీపీ-బీజేపీ కూటమిదే విజయం: వెంకయ్య
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 'డూప్ ఫైటింగ్' చేశాయని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ విషయం తేటతెల్లమైందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, సుధీష్ రాంభొట్ల, ఆచారితో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోతాయని తాము పలుమార్లు చెప్పామని, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్పారని వెంకయ్య అన్నారు. తాను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని విమర్శించలేదని, ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోమని కేసీఆర్ చెబుతుండడాన్ని బట్టి చూస్తే... కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అంతర్గతంగా బంధం కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఈ రెండు పార్టీలు ప్రజలను నమ్మించడానికి ఉత్తుత్తి ఫైటింగ్ చేశాయని ధ్వజమెత్తా రు. వైసీపీ, టీఆర్ఎస్ మధ్య కూడా అంతర్గత బంధం సజీవంగానే ఉందని ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు వైసీపీనిగాని, వైసీపీ నేతలు టీఆర్ఎస్‌ను గానీ విమర్శించలేదని అన్నారు. ఇప్పుడేమో కేసీఆర్ అటు సీమాంధ్రలో వైసీపీ, ఇటు తెలంగాణలో టీ ఆర్ఎస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయంటూ చెబుతున్నారని, ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనడానికి ఇదే తార్కాణమని అన్నారు. మోదీ, ఎల్లయ్య, పుల్ల య్య... ఎవరు అధికారంలోకి వచ్చినా... సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వానికే మద్దతు ఇస్తామం టూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా... కేంద్రం మద్దతు లేకుండా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించలేదని చెప్పారు.
ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణ రెండూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలేనని, రెండింటినీ అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందేనని అన్నారు. మోదీని ఎదుర్కొనే ధైర్యం లేక, ఆయన సవాళ్లకు సమాధానం చెప్పలేక ప్రత్యర్థి పార్టీలు వ్యక్తిగత దూషణలు, తిట్ల పురాణాలకు దిగాయని విమర్శించారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి కాంగ్రెస్ చివరకు మోదీ కులంపై నీచ రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. మోదీ ఓబీసీ కాదని, ఆయనది 'నీచ్ రాజనీతి' అంటూ విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. బొగ్గు, 2జీ, ఆదర్శ్, క్యాష్ ఫర్ ఓట్, చక్కెర, గోధుమ కుంభకోణాలకు పాల్పడినవారి ది ఏం రాజకీయమని ఆయన దెప్పిపొడిచారు. మోదీ కులం 'మోద్‌గాంచి'ని 1994లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల్లో చేర్చించిందని వివరించారు. మోదీ ప్రభుత్వానికి ఇప్పటివరకు 285 అవార్డులు వచ్చాయని, ప్రధాని పేరిట 7 అవార్డులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా 82, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు మరో 182... ఇలా గుజరాత్ ప్రభుత్వానికి దక్కాయని వివరించారు. చివరకు రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ కూడా గుజరాత్‌లోని ఆర్థిక సంస్కరణలపై చేసిన ప్రశంసను కాంగ్రెస్ నేతలు మరిచిపోవడం విచిత్రంగా ఉందని అన్నారు. ఎన్డీఏ 300 సీట్లు గెలుచుకుంటుందని, 17న నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ బీజేపీ-టీడీపీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని, సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మోదీకి మరింత దన్ను లభిస్తుందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం విపరీతంగా ఉందని, దీనికి ఎన్నికల సంఘాన్ని ఒక్కదానినే బాధ్యులుగా చూపడం తగదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment