Thursday 22 August 2013

కలిసి ఉంటే కోస్తాకే నష్టం! - Victor George NU VC

కలిసి ఉంటే కోస్తాకే నష్టం!

August 23, 2013


రాజమండ్రిలోని ఆదికవి నన్నయ వర్సిటీ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జార్జి విక్టర్ విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పనిచేశారు. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. దేశ, రాష్ట్ర
చరిత్రలకు సంబంధించిన తెలుగు అకాడమీ గ్రంథాలను క్షుణ్నంగా చదివారు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆదిశంకర వేదాంతంపై పరిశోధన చేశారు.

(రాజమండ్రి - ఆంధ్రజ్యోతి) 'నిజాం పాలనకు ముందు తెలుగుజాతి అంతా ఒక్కటిగానే ఉండేది. వారి పాలనలోనే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉండేవి' అని రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పి.జార్జి విక్టర్ తెలిపారు. తెలుగు జాతి ఒక్కటే అనేందుకు చారిత్రక సాక్ష్యాలు చాలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన, ఉద్యమాలు, ఉద్వేగాల నేపథ్యంలో 'ఆంధ్రజ్యోతి'కి జార్జి విక్టర్ ఇంటర్వ్యూ...


'ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఇవ్వాలని అడగడంలేదు. ఇంతకుముందున్న రాష్ట్రాన్నే అడుగుతున్నాం' అని తెలంగాణవాదులు అంటున్నారు కదా!
స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఎన్నడూ లేదు. సువిశాలమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలు ఒక భాగం మాత్రమే. తెలంగాణ అనేమాట మరాఠీవాళ్లు పెట్టిన పేరు. ఒక దేశానికి కేంద్రమే వాస్తవం. రాష్ట్రాలు మిథ్య. రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడినవే కానీ, వ్యక్తుల ఇష్టాయిష్టాలకోసం ఏర్పడినవి కావు. భావోద్వేగాల ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయరు.



అవును! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఒకనాడు నిజాం పాలనలోనివేనని చరిత్ర చెబుతోంది. బందరు (మచిలీపట్నం) అనే మాటకు అర్థం ఓడరేవు. విజయనగర మహారాజుకు 'మన్యం సుల్తాన్' అనే బిరుదు ఉండేది. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రిలోని ఏడు రోడ్ల జంక్షన్లు ముస్లిం నిర్మాణ శైలిని తెలియజేస్తాయి. కోస్తాలోని నిజాంపట్నం, ఔరంగాబాద్, హకుంపేట, నవాబ్‌పాలెం, కాశింకోట వంటివి నిజాం పాలనకు సజీవ సాక్ష్యాలు. అంతెందుకు.. వరంగల్‌కు 'ఆంధ్ర నగరం' అని పేరుండేది.



ఆంధ్రను పాలించిన నిజాం గోదావరిని దాటలేక ఆ ప్రాంతాన్ని వదులుకున్నాడు. తుంగభద్ర నదిని దాటలేక, పాలెగాళ్లతో వేగలేక రాయలసీమను అమ్మేసుకున్నాడు. నిజాం పాలన వల్ల 400 ఏళ్లపాటు విడిపోయిన తెలుగువాళ్లు స్వాతంత్య్రం వచ్చాక మళ్లీ కలిశారు. నిజాం పరిపాలన తొలిభాగంలో కూడా కొన్నాళ్లు కలిశారు. అంతకుముందు తెలుగు ప్రాంతాలన్నీ చిన్నచిన్న రాజ్యాలుగా ఎప్పుడూ కలిసే ఉండేవి.



సీమాంధ్ర అనే శబ్దమే తప్పు. రాయలసీమ, కోనసీమ అనే మాటలు ఉన్నప్పుడు సీమాంధ్ర ఏమిటి? ఆంధ్ర సీమ అనాలి. ముస్లింల పాలనకు ముందు ఆంధ్ర, తెలంగాణ మధ్య వైవిధ్యంకానీ, విభేదంకానీ లేవు. తెలుగు, తెలంగాణ అనే పదాల మధ్య తేడా లేదు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో పదం మధ్య 'సున్న' పెట్టి పలకడం అలవాటు. వచ్చిండు, పోయిండు, చేయంగ ఇలా! ఇదే కోవలో 'తెలుగు' నుంచి 'తెలంగ' అనే పదం ఆవిర్భవించింది. నిజానికి... కోస్తాలోని తెలుగు భాషపైనే తెలంగాణ ప్రభావం పడింది. తెలుగు అకాడమీ గ్రంథాల వల్ల తెలుగు భ్రష్టుపట్టింది. ఆంధ్ర ప్రాంత తెలుగుపై తెలంగాణ తెలుగు రుద్దారు. 400 ఏళ్ల ముస్లిం పాలన వల్ల సంస్కృతి అస్తవ్యస్తమైంది. అంతేకాదు... అప్పట్లో దళితులు, బ్రాహ్మణులు తెలంగాణ ప్రాంతం నుంచి కోస్తాకు తరలివచ్చారు. కోస్తాలోని అనేక బ్రాహ్మణ కుటుంబాల ఇంటి పేర్లు తెలంగాణలోని గ్రామాల పేర్లే. ముస్లిం పాలకుల బహు భార్యత్వపు విధానానికి భయపడి, తమ ఆడపిల్లలను కాపాడుకోవడానికి బ్రాహ్మణ కుటుంబాలు కోస్తా ప్రాంతానికి వచ్చేశాయి. కోస్తాలో కాల్వలు తీయడానికి వందలాది దళితులుకోస్తాకు వలస వచ్చారు.



సొంత రాష్ట్రం రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు వెళ్లడం తప్పేమీకాదు. జరిగిన తప్పులను ఎలాగైనా సరిదిద్దుకోవచ్చు. కానీ, ఒక జాతిని విభజించడం మాత్రం క్షమించరాని నేరం. కేసీఆర్ తెలుగుజాతి ద్రోహి. అబద్ధాల గని. అమాయక తెలుగు పౌరులను తిరోగమనంలోకి నెట్టబోయే చరిత్ర హీనుడు.



నిజానికి కలసి ఉంటే నష్టపోయేది కోస్తా ప్రాంతమే. అయినా ఒక్కజాతిగా కలసి ఉండాలని కోరుతున్నారు. సమైక్యాం«ద్రులుగా ఉండడం వల్ల కోస్తా అభివృద్ధి ఆగిపోయింది. ఇక్కడ ప్రభుత్వపరంగా పట్టణాలు, భవనాలు, ఉద్యోగ నియామకాలు, పరిపాలన విధానం పెరగలేదు. అన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృత మయ్యాయి. రాష్ట్ర విభజనపై ఇందిరాగాంధీ వంటి పరిపాలనదక్షురాలు తీసుకోని నిర్ణయాన్ని ఇప్పటి కాంగ్రెస్‌పార్టీ తీసుకోవడం దురదృష్టకరం.

No comments:

Post a Comment