Thursday 15 August 2013

విభజిస్తే కోస్తాంధ్రతో కలిసి ఉండలేం: టీజీ

విభజిస్తే కోస్తాంధ్రతో కలిసి ఉండలేం: టీజీ

August 16, 2013
కర్నూలు, ఆగస్టు 15: రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తాంధ్రతో కలిసి ఉండేది లేదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, విభజన అనివార్యమైతే గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులోని మౌర్యాఇన్ హోటల్‌లో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్యవేదిక పదో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

శ్రీభాగ్ ఒప్పందం మేరకు గతంలో కోస్తాంధ్ర వారు రాజధానిని రాయలసీమకు త్యాగం చేస్తే.. తెలంగాణ వారితో కలిసి ఉండాలని కర్నూలుగా ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తరలించామని ఆయన చెప్పారు. గతంలో రాష్ట్ర విభజన సమయాన బళ్ళారి, రాయచూర్ జిల్లాలను కోల్పోవడం వల్ల తుంగభద్ర జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
 

No comments:

Post a Comment