Monday 12 August 2013

కర్ణాటకలోనూ ఉద్యమ సెగ

కర్ణాటకలోనూ ఉద్యమ సెగ

August 12, 2013
బంట్వారం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో కర్ణాటకలోనూ ఉద్యమ సెగ ప్రారంభమైంది. గుల్బర్గ, బీదర్, రాయ్‌చూర్ జిల్లాల వాసులు తమను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి, తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్వపు నైజాం పాలనలో ఉన్న గుల్బర్గ, బీదర్, రాయచూర్, బళ్ల్లారి ప్రాంతాలను భాషా ప్రయుక్త రాష్ట్రాల సమయంలో కర్ణాటకలో విలీనం చేశారు. వీటిలో బల్లారి, కొప్పళ్ ప్రాంతాలు అనంతపురం జిల్లాకు సరిహద్దుగా ఉన్నాయి. అప్పటి నుంచి అనేక కష్ట నష్టాలతోపాటు వివక్షతకు గురవుతున్నామని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దు ప్రజల దుస్థితి పేరుకే కన్నడిగులుగా గుర్తింపు ఉన్నా, నేటికీ హైదరాబాద్, కర్ణాటక వాసులుగానే వీరిని సంబోధిస్తుండడం గమనార్హం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది.

ఇక్కడి ప్రాంతాలకు కేవలం కన్నడ మాత్రమే తెలిసి, తెగులురాని అధికారులు వచ్చి పని చేయడంతో ఇక్కడి ప్రజలు అనాదిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల్లో కొందరిని పలకరించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుల్బర్గ జిల్లా చించోలి తాలుకా పరిధిలోని కుంచవరం, వెంకటాపూర్, షాదిపూర్ పంచాయతీల పరిధిలో 29 గ్రామాలున్నాయి. ఇవన్నీ రంగారెడ్డి జిల్లా బంట్వారం, పెద్దేముల్ మండలాల పరిసరాలను ఆనుకొని ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 35 వేల మంది జనాభా ఉంటున్నారు. తెలుగు మాత్రమే రావడంతో జిల్లా రాజధాని కేంద్రాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్ కన్నడిగులు వచ్చారని వివక్షకు గురవుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు మీడియం స్కూళ్లు ఉండడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో కర్ణాటకలో ఉద్యోగ అవకాశాలు లేక, ఆంధ్రప్రదేశ్‌లో స్థానికేతరుల కింద పరిగణిస్తుండడంతో రెంటికీ చెడ్డ రేవడిలా స్థానికుల పరిస్థితి తయారైంది.

తెలంగాణలోనే వ్యాపారం ఇక అధికారికంగా పనులకు వెళ్లాలంటే రాష్ట్ర రాజధాని అయిన బెంగుళూరు జిల్లా కేంద్రం గుల్బర్గకు 300 కిలోమీటర్లు ఉండడం, రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ముఖ్యమైన ఒకటి రెండు పనులకు మినహా అన్ని పనులు తెలంగాణలోనే చేసుకుంటున్నామన్నారు.

వ్యవసాయ దారులు పండించిన పంటలను తెలంగాణలోని జహీరాబాద్, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు తరలిస్తారు. అనేక మంది రైతులకు ఇక్కడి ప్రాంతాల్లో భూములున్నాయి. వ్యాపార నిమిత్తం వీరు తెలంగాణపై ఆధారపడి ఉన్నారు. వైద్య సౌకర్యాలు సైతం ఇక్కడే పొందుతున్నారు.

No comments:

Post a Comment