తెలంగాణకు పది అడుగులు
1. కేంద్ర క్యాబినెట్ నోట్ తయారుచేయాలి.
2. కేంద్ర క్యాబినెట్ సమావేశమై, ఆ నోట్ పై చర్చించాలి.
3. విధివిధానాలను సూచించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి.
4. క్యాబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సుల్ని కేంద్ర క్యాబినెట్ కు అందజేయాలి.
5. సబ్ కమిటీ సిఫార్సుల్ని రాష్ట్రపతికి పంపించాలి.
6. సబ్ కమిటీ సిఫార్సుల్ని అందుకున్న రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ అభిప్రాయం అడగాలి.
7. రాష్ట్ర శాసనసభ సమావేశమై, విభజనపై తీర్మానం చేయాలి.
8. శాసనసభ తీర్మానంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి.
9. రాష్ట్రపతి (విభజనకు అనుకూలంగావుంటే) రాష్ట్ర ఏర్పాటుకు గడువును విధిస్తూ పార్లమెంటుకు సూచించాలి.
10. రాష్ట్రపతి సూచనకు పార్లమెంటు ఆమోదం తెలిపితే రాష్ట్ర విభజన బిల్లు పాస్ అవుతుంది.
సాధారంగా ఈ ప్రక్రియకు తొమ్మిది, పది నెలలు పడుతుంది. ఆరు నెలల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసే ఉద్దేశ్యంలో కాంగ్రెస్ వుంది.
- కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే!
1 ఆగస్టు 2013
No comments:
Post a Comment