వికటించిన ఎఫ్‌డిఐ మోజు
August 22, 2013
విదేశీ ఇన్వెస్టర్లు దేశాన్ని ఉద్ధరించేందుకు పెట్టుబడులు పెట్టరు. లాభాలే ధ్యేయంగా వస్తారు. దేశంలోకి ఎఫ్‌డిఐల రూపంలో తీసుకువచ్చిన పెట్టుబడులకు అనేక రెట్ల ఎక్కువ మొత్తాన్ని, రాయల్టీలు, టెక్నాలజీ ఫీజు, మేనేజ్‌మెంట్ రుసుము, ముడిపదార్థాల సప్లయ్, పరికరాల సప్లయ్, డివిడెండ్లు... పేరిట తదుపరి కాలంలో స్వదేశాలకు తరలించుకు పోతారు. ఒక అధ్యయనం ప్రకారం ఈ రకంగా వారు తరలించుకుపోయే మొత్తం వారి అసలు పెట్టుబడికంటే కనీసం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వం ఎఫ్‌డిఐలపై మో జును పెంచుకుంటూ దేశీయ కంపెనీల పెట్టుబడులను నిర్లక్ష్యం చేయడం రూపాయిని బాగా బలహీనపర్చింది. ఎఫ్‌డిఐలు ఆర్థిక రం గానికి కల్పించేది తాత్కాలిక ఉపశమనమే. దేశీయ కంపెనీల పెట్టుబడులే ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తాయి. విదేశీ ఇన్వెస్టర్లు దేశాన్ని ఉద్ధరించేందుకు పెట్టుబడులు పెట్టారు. లాభాలే ధ్యేయంగా వస్తారు. దేశంలోకి ఎఫ్‌డిఐల రూపంలో తీసుకువచ్చిన పెట్టుబడులకు అనేక రెట్ల ఎక్కువ మొత్తాన్ని, రాయల్టీ లు, టెక్నాలజీ ఫీజు, మేనేజ్‌మెంట్ రుసుము, ముడిపదార్థాల సప్ల య్, పరికరాల సప్లయ్, డివిడెండ్లు... పేరిట తదుపరి కాలంలో స్వదేశాలకు తరలించుకు పోతారు. ఒక అధ్యయనం ప్రకారం ఈ రకంగా వారు తరలించుకుపోయే మొత్తం వారి అసలు పెట్టుబడికంటే కనీ సం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
అక్రమాలను అరికట్టేందుకు టాన్స్‌ఫర్ ప్రైసింగ్ విధానాలున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలేదు. ఇలా చూస్తే మధ్యకాలిక దృక్పథంలో ఎఫ్‌డిఐలు ఆర్థిక రంగానికి చేసే మేలు కన్నా కీడే ఎక్కువ అన్నది నిర్వివాదం. ప్రభు త్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో విశ్వాసం సడలిన భారతీయ కంపెనీలు గత ఐదేళ్లలో 4,000-5,000 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. ఒక పక్క భారీ ఎత్తున ఎఫ్‌డిఐలు రావాలని తలుపులు బార్లా తెరుస్తూ భారత కంపెనీల పెట్టుబడులు విదేశాలకు తరలిపోయే విధానాలు చేపట్టడంలోని ఔచిత్యాన్ని ఏవిధంగా సమర్థించగలరు ?
వికటించిన చర్యలు
ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి రూపాయి విలువలో క్షీణతను నిరోధించడానికి మన ప్రభుత్వం గత కొద్ది నెలలుగా తీసుకున్న చర్యల విషయానికి వద్దాం. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను ప్రభు త్వం గత మూడు, నాలుగు నెలల కాలంలో అంచెలంచెలుగా పది శాతం మేరకు పెంచింది. ఈ సుంకాలు పెంచడం ఏ మాత్రం తప్పు కాదు. కాని బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీని తగ్గించడానికి తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఎంఎస్ఎఫ్ పై వడ్డీరేటు పెంచ డం, ఎల్ఎఎఫ్ మొత్తాన్ని కుదించడం, బ్యాంకులు కరెన్సీ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ చేయడాన్ని నిషేధించడం వంటి చర్యల ద్వారా బ్యాంకులకు ఆర్బిట్రేజ్ పొజిషన్లు లేకుండా చేసింది. ఆర్బిట్రేజ్ పొజిషన్లున్నట్టుయితే బ్యాంకుల్లో డాలర్ల విలువ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందన్న భయాలే ఇందుకు కారణం. అంతే కాదు ఈ నెల 14న ఉన్నట్టుండి మన ప్రభుత్వం మరికొన్ని చర్యలు ప్రకటించింది. విదేశీ కంపెనీల్లో భారత కంపెనీల పెట్టుబడుల పరిమితిని వాటి నికర విలువలో 400 శాతం నుంచి 100 శాతానికి కుదించడం, భారతీయులు ఎలాంటి ఆంక్షలు లేకుండా విదేశాలకు పంపించుకోవడానికి అవకా శం ఉన్న నగదు పరిమితిని రెండు లక్షల డాలర్ల నుంచి 75 వేల డాలర్లకు తగ్గించడంతోపాటు విదేశాల్లో భారతీయులు స్థిరాస్తులు కొనుగోలు చేయడాన్ని నిషేధించింది.
ఈ చర్యలన్నీ భారత ప్రభుత్వం క్యాపిటల్ అకౌంట్‌పై పరిమితులు విధిస్తుందన్న భయాలు వ్యాపించడానికి కారణమయ్యాయి. ఎఫ్ఐఐలు భయోత్పాతానికి గురై భారీగా నిధులు ఉపసంహరించారు. స్టాక్ మార్కెట్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న భారీ పతనానికి, రూపాయి విలువలో తాజా క్షీణతకు ఇదే కారణం. మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముందుచూపు లేదన్నది ఇక్కడ స్పష్టమవుతోంది.
చెబితే విన్నారా... ?
డాలర్ మారకంలో రూపాయి విలువ 44/45 రూపాయల స్థాయికి దిగజారినప్పుడే నా వ్యాసా ల్లో ఇలాంటి అంశాలు పలు సందర్భాల్లో ప్రస్తావించి హెచ్చరిక సంకేతాలు ఇవ్వడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం మేల్కొని కొన్ని అనవసర దిగుమతులను నిషేధించి, పరిమాణాత్మకమైన ఆంక్ష లు విధించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారేది కాదు.
ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం దోహదకారి కాని దిగుమతులను నియంత్రించి ఎగుమతులకు అవరోధాలు తొలగించి ఉంటే రూపాయి విలువలో క్షీణతను ప్రారంభ దశలోనే అరికట్టగలిగి ఉండే వారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కూడా బాగుండేది. విదేశీ మారకం నిల్వల పరిస్థితి కూడా మెరుగ్గా ఉండేది. రూపాయి విలువను నిరోధించడానికి తీసుకునే చర్యలేవైనా చేదు గుళిక వలె కాకుండా హోమియో మందు లాగే తీయగా ఉండి దీర్ఘకాలిక ఫలితాలు సాధించగలిగేవి కావాలి. కాని మన విధాన కర్తలు ఇందుకు భిన్నంగా వ్యవహరించి పరిస్థితిని చేతులారా సంక్లిష్టం చేస్తున్నారు. రోగం ఒకటైతే చికిత్స వేరొక దానికి చేస్తున్నారన్నది నిష్ఠుర వాస్తవం.
డాలర్ బాండ్ స్కీమ్‌తో మంచి ఫలితం
ఎఫ్‌డిఐల మోజును తగ్గించుకుని ప్రభుత్వం విదేశాల్లో భారతీయు లు దాచుకున్న డాలర్లను తిరిగి దేశంలోకి తీసుకువచ్చేందుకు డాలర్ బాండ్ స్కీమ్ వంటిది ప్రవేశపెట్టడం మంచిది. స్వచ్ఛంద డాలర్ నిల్వల వెల్లడి పథకం వంటిది ప్రవేశపెడితే విదేశాల్లో డాలర్లు దాచుకున్న వారు ఆకర్షితులై తమ ధనాన్ని దేశంలోకి తరలించే వీలుంటుంది. ఇందులో మంచి చెడుల చర్చకు ఇది సమయం కాదు. రూపాయిని కాపాడుకోవడమే ముఖ్యం. అంతేకాదు 2004లో వి కృష్ణమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన నేషనల్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి.
కాని ఆ కమిటీ సిఫారసులు ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడమే విచారించదగ్గ అంశం. దేశీయంగా ఇనుప ఖనిజం ఉత్పత్తిని పునరుద్ధరించి ఇనుప ఖనిజంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను కూడా పెంచుకోవాలి. ఈ చర్యలు తక్షణం తీసుకోకపోతే రూపాయి మరింతగా క్షీణించి 1991 నాటి పరిస్థితి పునరావృతం కావడం ఖాయం

No comments:
Post a Comment