Friday 2 August 2013

Local and Non-local

ఎవరు లోకల్ !?

August 03, 2013
(హైదరాబాద్,ఆగస్ట్ 2 :రాష్ట్ర విభజన ప్రక్రియ అధికారికంగా ముగిసిన మరుక్షణమే స్థానిక, స్థానికేతరులు అనే మరో కొత్త వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఒకే రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలు, లోకల్, నాన్ లోకల్ విధానం ఉండదు. కానీ... తెలంగాణ ప్రాంతవాసుల విద్యా, ఉపాధి అవకాశాలను వేరే ప్రాంతాల వారు దక్కించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో 'స్థానికుల' ప్రయోజనాల రక్షణకు వీలుగా పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రాన్ని ఆరు జోన్లగా విభజించారు. ఆయా ఉద్యోగాల స్థాయిని బట్టి స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు రిజర్వు చేశారు. ఇప్పటిదాకా ఇదే కోటా ప్రకారం నియామకాలు జరుగుతున్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన వారికీ, ఇతరులకు మధ్య వివాదం తలెత్తింది. అప్పుడే ముల్కీ నిబంధనలను తెచ్చారు .దీని ప్రకారం ఒక ప్రాంతంలో ఏడేళ్లుగా స్థిర నివాసం ఉన్న వారిని స్థానికులుగా గుర్తిస్తారని పేర్కొన్నారు. వరుసగా నాలుగేళ్లు ఒకే ప్రాంతంలో చదివిన విద్యార్థులను 'లోకల్'గా గుర్తిస్తారు.


విభజన తర్వాత?: స్థానిక, స్థానికేతరులకు సంబంధించిన నిబంధనలు విభజన తర్వాత కూడా కొనసాగుతాయా? ఇదీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎవరు లోకల్, ఎవరు నాన్‌లోకల్ అనే అంశం మరోసారి చర్చకు వస్తుందని... ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మా త్రం హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ స్థానికులే అని ప్రకటించారు. ఇదే ని బంధన ఉపాధి, విద్యా అవకాశాలకు కూడా వర్తిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ అంశంపై... గతంలో కొన్ని రాష్ట్రాల విభజన సమయంలో అక్కడ పనిచేసిన సీనియర్ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది. ఒక కటాఫ్ తేదీని ప్రామాణికంగా తీసుకుని... దాని ప్రకారమే స్థానికత ను గుర్తిస్తారని వారు చెప్పారు. "ఈ అంశంపై రాష్ట్ర విభజన బిల్లులోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి. లేదంటే అనేక వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది'' అని అధికార వర్గాలు పేర్కొన్నా యి.


మరి ఉద్యోగులు సంగతేమిటి?:ఉద్యోగుల విషయంలోనూ నియామక తేదీ ఆధారంగా ఒక కటాఫ్ నిర్ణయించి స్థానికులు, స్థానికేతరులుగా విభజిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, రాష్ట్ర రాజధానిలోని పలు శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగాలు ఓపెన్ కేటగిరిలోనే ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రాంతం వారినైనా నియమించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే ఇతర ప్రాంతాల వారు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుందా? లేక ఇక్కడే కొనసాగవచ్చా? అనే అంశాలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఈ అంశంపైనా కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు రూ పొందించాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఐఏఎస్‌లకు సంబంధించి కేడర్ విభజన జరుగుతోంది. మిగిలిన ఉద్యోగుల విషయంలో సర్వీసు రూల్స్ ప్రకారం విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.

తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల హైదరాబాద్‌లో స్థిరపడి... ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకున్న పిల్లలు విభజన తర్వా 'ఇతర రాష్ట్రానికి' వెళ్లాల్సి ఉంటుంది. వీరు ఆ ప్రాంతానికి 'నాన్ లోకల్' అవుతారా? ఇదీ సమస్యే! వీటన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వమే నిపుణుల కమిటీని నియమించి... స్పష్టమైన, సందేహాలకు అతీతంగా నియమ, నిబంధనలు రూపొందించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment