Wednesday 14 August 2013

కాంగ్రెస్ - తెలంగాణ

కాంగ్రెస్ - తెలంగాణ
15 ఆగస్టు  2013

1. సమయం సందర్భం
తెలంగాణ ప్రకటనకు సమయాన్ని ఎంచుకోవడంలో కాంగ్రెస్ అధిష్ఠానం గొప్ప చాతుర్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా వున్న కేసీ‌ఆర్ ఆత్మరక్షణలో వున్నారు. తెలంగాణను గట్టిగా సమర్ధించే మరోపార్టి బీజేపి కూడా నిర్లిప్తంగా వుంది.  ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం  పార్టి ఊగిసలాటలో వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోతూవుంది. ఇలాంటి సందర్భాన్ని ఎంచుకోవడంవల్ల, టీ_ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపినట్టయింది. ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక లాభపడుతుంది.

2. తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యం
దాదాపు అరవై యేళ్ల కలను  కాంగ్రెస్ అధిష్టానం  నెరవేర్చినా, దాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోవడంలో టీ- కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. కే. జానారెడ్ది, దామోదర రాజా నరసింహ వంటి ఒకళ్ళిద్దరు మీట్ _ద_ప్రెస్ వంటి కార్యక్రమాలకు పరిమితంకాగా, మిగిలినవాళ్ళు ఆపాటి కార్యక్రమాల్ని కూడా జరుపులేకపోయారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  ప్రకతన వెలువదిన ఒకతి రెండు రోజుల్లోనే తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటి  భారీ విజయోత్సవాలని జరిపివుండాల్సింది. కానీ, అలా జరగలేదు. అలా అమ్డివచ్చిన అవకాశాన్ని కూడా కాంగ్రెస్ చేజార్చుకుంది.

3. టి‌ఆర్ ఎస్, బీజేపి హైజాక్
కాంగ్రెస్ తెలంగాణ ప్రకటనను టి‌ఆర్ ఎస్, బీజేపి సద్వినియోగం చేసుకున్నాయి.  కేసి‌ఆర్ ఆ ప్రకటనను తనకు అనుకూలంగా మార్చుకోగా, బీజేపి ఏకంగా హైజాక్ చేసేసింది. ఈ హైజాక్ కార్యక్రమాన్ని  సుష్మా స్వరాజ్ మొదలెట్టగా, నరేంద్ర మోడీ దాన్ని పూర్తి చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని  మోడీ హైదరబాద్లో మొదలెట్టడం  విశేషం.

4. నరేంద్ర మోడీ సభకు చారిత్రక నేపథ్యం
బీజేపి ఎన్నికల ప్రచార సారధి నరేంద్రమోడీ నవభారత యువభేరిని హైదరాబాద్ లో మొదలెట్టడానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది.  1984  లోక్ సభ ఎన్నికల్లో, రాజీవ్ గాంధీ సృష్టించిన ప్రభంజనానికి బీజేపి మట్టి కరిచింది. ఆ ఎన్నికల్లో  వాజ్ పాయి, ఎల్ కే అద్వానీ వంటి అగ్రనేతలు సహితం ఓడిపోగా, లోక్ సభలో ఆ పార్టీకి రెండే స్థానాలు దక్కాయి. వాటిల్లో మొదటిది, గుజరాత్ లోని, మెహాసనా కాగా, రెండోది ఆంధ్రప్రదేశ్ లోని హనుమకొండ. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి పాత సెంటిమెంటుతో, తెలంగాణపాయ్ దృష్టిని కేంద్రీకరించారు.    


5. విభజన విధివిధానాల్లో తొందరపాటు
కేవలం సీపీ‌ఐ యం, యంఐయం తప్ప, అంధ్రప్రదేశ్ లో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టి అన్నింటికన్నా ఆఖర్న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించింది. మిగిలిన పార్టీలేవీ, ఇప్పటి వరకు విధివిధానాల్ని ప్రకటించకపోయినా, కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు వుంచుతామనీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామనీ ప్రకటించింది. రాష్ట్ర విభజనకు ఈ రెండు అంశాలే సరిపోవు. ప్రకటించిన రెండు అంశాలు కూడా అసమగ్రంగా వున్నాయి. ఇది తెలంగాణలోనేగాక, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లోనూ అనేక అనుమానాలను రేకెత్తించింది.

6. సీమాంధ్రుల భద్రత
గ్రేటర్ హై‌అదరాబాద్ లో  సీమాంధ్రుల జనాభా దాదాపు పదిలక్షలు (మిలియన్) వుంటుందని అంచన. ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా దాదాపు అదే సంఖ్యలో సీమాంధ్రులు వుంటారు. వీరి భద్రత విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణాలో సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఆవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగలేదు. అయితే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కాకపోయినా, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాంగ్రెస్ తెలంగాణాను ప్రకటించిన మరునాడు, ఆంధ్రా ఉద్యోగులు తమ రాష్ట్రానికి వెళ్ళిపోవాలని కేసి‌ఆర్ చేసిన ప్రకటన భారత జీవిత బీమా వంటీ కార్యాలయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఇది పొంచివున్న ప్రమాదానికి తొలి సంకేతం మాత్రమే.

7. ఉపాధికల్పన
రాష్ట్ర రాజధాని మాత్రమేగాక, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నగరం కావడాన తెలంగాణవాసులతోసహా, సీమాంధ్రులకు కూడా హైదరాబాద్  ఉపాధి గమ్యంగా మారింది. హైదరాబాదుకు దీటుగా సీమాంధ్రలో ఉపాధి కల్పన అవకాశాల్ని పెంచుతున్నట్టు స్థానిక ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. అక్కడ చేపట్టే ప్రాజెక్టులేమిటో ఇప్పుడే ప్రకటించాలి. అంత వరకు సీమాంధ్రలో భయాందోళనలు కొనసాగుతుంటాయి.

ఏ. ప్రభుత్వ ఉద్యోగాలు
 రాష్ట్ర విభజనవల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇబ్బంది వుండదని అంటున్నారు. ఆ విషయాన్ని  గణాంకాలతో వివరించాలి. కొత్త రాష్ట్రం  ఏర్పడడంవల్ల సీమాంధ్రలో కొత్తగా ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని అంటున్నాతు. అవి ఎలా వస్తాయో, ఏ స్థాయి ఉద్యోగాలు వస్తాయో ప్రజలకు వివరించాలి.   ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆప్షన్స్ వుంటాయా? వుండవా?  సీంఆంధ్రా జోన్లకు చెందిన ప్రభుత్వోద్యోగుల్లో ఎంతమంది కొత్త రాజధానిలో వుంటారూ?  ఎంతమంది స్వంత జోన్లకు పోవాల్సి వుంటుందీ?  ఈ లెఖ్ఖల్ని వీలైనంత త్వరగా తేల్చాలి. ఆలస్యం జరిగేకొద్దీ, వదంతులు వ్యాపించి అనేక అనర్ధాలు జరుగుతాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ యుధ్ధరంగాలుగా మారిపోతాయి. అలాంటి సూచనలు జీవిత బీమా వంటి సంస్థల్లో  అప్పుడే కనిపిస్తున్నాయి.

బీ. ప్రైవేటు ఉద్యోగాలు
ఉద్యమకాలంలో ఉపాధి కల్పన గురించి తెలంగాణ నాయకులు స్థానికులకు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. వీటి మీద తెలంగాణ ప్రజలు చాల ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేరకపోతే పరిస్థితి ఏమిటీ? తెలంగాణ ఉద్యమం ఆరంభమయ్యాక ఇప్పటివరకు అది శాతియుతంగానే సాగిందని చెప్పాలి. ఎప్పుడూ సీమాంధ్రుల మీద దాడులు జరగలేదు. కానీ, రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడ నిరుద్యోగ సమస్య పరిష్కారంకాకపోతే కొన్ని విపరీత పరిణామాలు జరిగే ప్రమాదముంది. స్థానిక  నాయకులు  ఆ నెపాన్ని, ప్రైవేటురంగంలోవున్న సీమాంధ్రుల మీదకు నెట్టివేయవచ్చు. అప్పుడు, ముంబాయిలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సాగిస్తున్న ఆగడాలు వంటివి   తలెత్తవచ్చు. వీటికి పరిష్కారాన్ని ఇప్పుడే ఆలోచించాలి.

8.   విద్యారంగం
హైదరాబాద్ లో దాదాపు పదిహేను విశ్వవిద్యాలయాలున్నాయి. అలాగే నగరంలో అత్యున్నత ప్రమాణాలుగల కళాశాలలు అనేకం వున్నాయి. ఈ రెండింటికీ సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యామ్నాయా విద్యాసంస్థలు ఏర్పాటు కావాలి. అంతవరకు  హైదరాబాద్ విద్యాసంస్థల్లో సీమాంధ్ర విద్యార్ధులకు ఇప్పుడున్న సౌకర్యాలను కొనసాగించాలి.

9.  పరిశ్రమలు
రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలేకాదు, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు కూడా లేవు. ఫలితంగా ప్రతిఒక్కరూ ఉపాధికోసం హైదరాబాదు బస్సో, రైలో ఎక్కి వలస రాక తప్పడంలేదు. ఇప్పుడు ఎదురు వలస ఆరంభం కావాలి. దానికి తగ్గ పరిశ్రమలు సీమాంధ్ర ప్రాంతంలో నేలకొనాలి.

10.  సాగునీరు - తాగునీరు
సీమాంధ్ర ప్రాంతంలో వ్యవసాయంతప్ప మరో ఉపాధిలేకపోవడాన, అక్కడి ప్రజలకు సాగునీరు ప్రాణప్రదమైనది. వరదలు వచ్చిన సంవత్సరాల్లో, గోదావరి నదిలో భారీగా నీరు సముద్రంలో కలిసిపోతున్న విషయం వాస్తవమే. అయితే, ఇలాంటి వరదలు ఒక క్రమంలో ఐదారు యేళ్ళకు ఒకసారి వస్తాయి. మిగిలిన సంవత్సరాల్లో సగటు నీరు కూడ రావు. కృష్ణా, గోదావరి నదుల్లో లోయర్ రైపేరియన్ హక్కుల్ని కాపాడడానికి ఒక పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం  అవసరం.

No comments:

Post a Comment