Thursday 29 January 2015

జైశంకర్‌ అణుదౌత్యం

మోదీ-సుష్మా మధ్య ‘విదేశీ’ చిచ్చు!

  విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్‌పై వేటు
 నూతన కార్యదర్శిగా జైశంకర్‌
 ప్రధాని నిర్ణయంపై సుష్మా అసంతృప్తి

న్యూఢిల్లీ, జనవరి 29 : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటన విజయవంతంగా ముగిసిన మరుసటి రోజే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతాసింగ్‌పై వేటు పడింది. మరో 8 నెలల పదవీకాలం ఉండగానే ఆమెను తొలగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో అమెరికాలో భారత రాయబారి సుబ్రమణ్య జైశంకర్‌ను నియమించింది. ఈయన మరో రెండు రోజుల్లో ఉద్యోగవిరమణ చేయాల్సి ఉంది. అయితే, విదేశాంగ కార్యదర్శి హోదాలో ఆయన రెండేళ్లు కొనసాగనున్నారు. జైశంకర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆనవాయితి ప్రకారం ఆయనకు బాధ్యతలు అప్పగించాల్సిన సుజాతాసింగ్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. కాగా, తన తొలగింపుపై సుజాతాసింగ్‌ స్పందించారు. తాను ముందుగా ఉద్యోగవిరమణ కోరుకున్నానని, ఆ ప్రకారమే పదవీబాధ్యతల నుంచి విముక్తి పొందానని తెలిపారు. వ్యవస్థల కన్నా వ్యక్తులు గొప్పవారు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు జైశంకర్‌ నియామకం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ నడుమ చిచ్చు రేపుతోంది.
28 ఏళ్ల తర్వాత మరోసారి
భారతదేశ చరిత్రలో దేశ అత్యున్నత దౌత్యాధికారిపై ప్రభుత్వం వేటు వేయడం ఇది రెండోసారి. 28 ఏళ్ల క్రితం 1987లో అప్పటి విదేశాంగ కార్యదర్శి ఏపీ వెంకటేశ్వరన్‌ను ప్రధాని రాజీవ్‌గాంధీ అవమానకరమైన రీతిలో తొలగించారు. పత్రికలు, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల సంఘం రాజీవ్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కాగా, సుజాతాసింగ్‌ తొలగింపుపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి దేవయాని కోబ్రగడే విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్లే ఆమెపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని మాజీ కేంద్ర మంత్రి మనీష్‌ తివారి ఆరోపించారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.
ఎవరీ జైశంకర్‌! 
1977 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన జైశంకర్‌ గతంలో చైనా, సింగపూర్‌, చెక్‌ రిపబ్లిక్‌లో భారతరాయబారిగా పనిచేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనను విజయవంతం చేయడంలో కీలకపాత్ర జైశంకర్‌దే. మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఒబామాను గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా తీసుకురావడంలోనూ, అమెరికా ఇండియా పౌర అణు ఒప్పందానికి ఉన్న అవరోధాలను తొలగించడంలోనూ కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ చేసిన జైశంకర్‌ అణుదౌత్యంపై స్పెషలైజేషన్‌ చేయడం గమనార్హం. 2013 సెప్టెంబర్‌లో అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్‌ ఆ సమయంలో ఇరుదేశాల నడుమ వివాదాస్పదంగా మారిన దేవయాని సమస్యను కొలిక్కి తీసుకొచ్చి, ఆమెను స్వదేశానికి పంపడంలో కృషి చేశారు.
ఢిల్లీ సభలకు సుష్మా గైర్హాజరు
జైశంకర్‌ నియామకంపై సుష్మా అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను సంప్రదించకుండానే తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆమె సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుజాతాసింగ్‌ పనితీరుపై ప్రధాని తొలి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆమెను తొలగించాలని భావించినా సుష్మా వ్యతిరేకించారు. ఈ కారణంగానే గత ఆరునెలలుగా విదేశాంగ శాఖలో ఎలాంటి కీలక నిర్ణయాలూ పీఎంవో ఆమోదానికి నోచుకోలేదు. కాగా, జైశంకర్‌ నియామకంపై కినుకు వహించిన సుష్మా గురువారం ఢిల్లీలో రెండు ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉన్నా వాటిని రద్దు చేసుకున్నారని సమాచారం. అయితే, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తానే సుజాతాసింగ్‌కు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశానని సుష్మా తెలిపారు.నాడు మన్మోహన్‌ ఓకే.. సోనియా నో
విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన జైశంకర్‌ వాస్తవానికి 2013లోనే ఆ పదవిలో నియామకం కావాల్సి ఉంది. యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించాలని భావించగా కాంగ్రెస్‌ అధినేత్రి సుజాతాసింగ్‌ను తెరపైకి తెచ్చారు. సుజాతాసింగ్‌ తండ్రి, మాజీ ఐబీ చీఫ్‌ టీవీ రాజేశ్వర్‌ కాంగ్రెస్‌వాది కావడమే సోనియా నిర్ణయానికి కారణం. 


Who is S Jaishankar?



1. 60-year-old Subrahmanyam Jaishankar is an Indian diplomat and has been appointed as the foreign secretary of India for a tenure of two years on 28 January, 2015.

2. Jaishankar has an experience of over 36 years in the foreign service. He was India's ambassador to China from 2007 to 2009, as high commissioner to Singapore, and from 2001 to 2004 as ambassador to the Czech Republic.

3. Jaishankar played a key role in negotiating the US-India civil nuclear agreement.

4. Jaishankar was appointed as India's ambassador to United States in September 2013. He took charge on December 23, 2013 succeeding Nirupama Rao. He arrived in the United States amid the Devyani Khobragade incident, and was involved in negotiating the Indian diplomat's departure from the United States

5. Jaishankar was India's longest-serving ambassador to China, with a four-and-a-half year term. As ambassador to Beijing, Jaishankar was involved in improving economic, trade and cultural relations between China and India, and in managing the China-Indian border dispute.

6. Being born in New Delhi, he did his schooling from Air Force Central School, New Delhi and is a graduate of St Stephen's College at the University of Delhi. He has an MA in Political Science and an M.Phil and PhD in International Relations from Jawaharlal Nehru University (JNU), where he specialized in nuclear diplomacy. He is the son of prominent Indian strategic affairs analyst, commentator, and civil servant K Subrahmanyam.
Stay updated on the go with Times of India News App. Click here to download it for your device.

No comments:

Post a Comment