ఫూలేనాటికి మతతత్వం లేదు
‘కుల మత వేర్పాటు వాద పాచి కలతో భారతదేశ ప్రజలను విభజించి పాలించిన బ్రిటిష్ వలస పాల కులు ఆనాడు మన మెదళ్లలో ఎక్కించిన మతోన్మాద మత్తు మతతత్వ విపత్తుగా మారి ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. మన దేశ ప్రజల మెదళ్లలో పేడ, చెత్త పేరుకు పోయి నట్లు మతోన్మాదం నిండిపోయింది. ఉర్ధూ భాష ముస్లింలదని, సంస్కృత భాష బ్రాహ్మణులదని భాషలను సైతం మతంతో కులంతో ముడిపెడుతున్నారు. భారతదేశాన్ని హిందూ దేశం (హిందుస్థాన్)గా కాకుండా ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. కానీ ఆ కృషి నిరుపయోగంగా మారింది. అలాగే పాకిస్థాన్ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాద ముఠాలు ఒకరినొకరు హతమా ర్చుకొంటున్నాయి. చివరకు పిల్లలు సైతం స్వేచ్ఛగా బడికి వెళ్లి చదువుకోలేని స్థితి ఏర్పడి పాకిస్థాన్ పాగల్‌స్థాన్ గామారింది’ అని వాపోతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కెండేయ్ కట్జూ ఏప్రిల్ 6,7 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన ఉర్దూ భాషా సదస్సులో, మీడియా సదస్సులో విమర్శనాత్మక వాఖ్యలు చేశారు.
ఇందుకు మూలకారణాలను వెలికితీస్తూ గత చరిత్రలోకి వెళ్ళి, 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు ఏకోన్ముఖంగా చేసిన తిరుగుబాటును ఎదుర్కొనే క్రమం లో- ఏర్పడిన మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతని దెబ్బతీసే విధంగా బ్రిటిష్‌వారు వారిమధ్య మత విద్వేషాల్ని రెచ్చగొట్టి, మత కలహాలను సృష్టించి మతోన్మాద మతతత్వానికి నాంది పలికారన్నా రు. 1857కి ముందు వరకు మన దేశంలో మతతత్వం లేదని చెప్ప డానికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఇరుమతాలవారు ఏకో న్ముఖంగా తిరుగుబాటు చేయటమే నిదర్శనమన్నారు.
అదే కాదు మరో నిదర్శనం కూడా ఉంది. 1857కి ఒక ఏడాది ముందు 1855లో మహాత్మ జ్యోతిరావు ఫూలే రాసిన ‘మూడో నేత్రం’ అనే చారిత్రాత్మక నాటిక మరో ఆధారం. బ్రిటిష్ వలసపాల కులపై త్వరలో తిరుగుబాటు జరగబోతోందనే రాజకీయ తుఫాన్ హెచ్చరిక ఆ నాటికలో నిక్షిప్తమైంది (మరాఠీ మూలం నుండి ఆ నాటిక తెలుగులోకి అనువాదమై పూలే జయంతి రోజున వెలుగు లోకి వస్తోంది). ఆ తదుపరి ఏడాది తర్వాత జరిగిన తిరుగుబాటుకి ఆయన సజీవ సాక్షిగా ఉన్నాడు. కానీ ఆయన ఆ తిరుగుబాటును దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పరిగణించలేదు. అందుకే దాన్ని స్వాగతించలేదు, సమర్థించలేదు.
బ్రిటిష్ వారితో పాటు ఇండియాలో ప్రవేశించిన ఆధునికత వల్ల, కాలానుగుణ్యమైన మార్పులను జరగనీయకుండా ఈ దేశ బ్రాహ్మణీయ అగ్రవర్ణ శక్తులు మోకాలొడ్డి అభివృద్ధి నిరోధక తిరోగామి మార్గం పట్టాయి. పూర్వ వైభవాన్ని తిరిగి పొందటం కోసం, మధ్య యుగాల నాటి ఫ్యూడల్ రాచరిక వ్యవస్థను తిరిగి నెలకొల్పటం కోసం బ్రాహ్మణ, క్షత్రియ, మొగలాయి చక్రవర్తులు చేసిన తిరుగుబాటు- ఉమ్మడి రాజ్యకాంక్షతో చేసిన తిరోగమన శక్తుల తిరుగుబాటేతప్ప దేశ స్వాతంత్య్రంకోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిందికాదని ఫూలే స్పష్టంచేశాడు. బ్రిట ిష్ వలసపాలకులు తుపాకీ తూటాలకు ఆవు, పందికొవ్వు వాడడంవలన హిందు, ముస్లింసైని కులు చేసిన తిరుగుబాటులో కనిపించే ఇరుమ తాలవారి ఐక్యత యాదృచ్ఛికమే. ఆ సంఘటన లు జరగకపోయినా తిరుగుబాటు జరిగేదనని చెప్పాడు.అంతేకాదు ‘ధర్మోరక్షితే రక్షితః’ అంటూ ‘(మను) ధర్మాన్ని రక్షిస్తే (మను) ధర్మమే రక్షిస్తుంది’ అనే భరోసాతో- ప్రాచీన మధ్యయు గాల కాలమంతటా రాజరిక పాలనాధికార పరిరక్షణ సాధనంగా చలామణఇయిన మను ధర్మం ఆధునిక కాలపరీక్షకి గురై మొదటిసారిగా ఆత్మ రక్షణలో పడింది.
వ్యక్తి స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య భావన- వ్యక్తి స్వేచ్ఛను అనుమ తించని కుల వారసత్వ లక్షణాన్ని (హెరిడిటరీని) సవాల్ చేసింది.ఈ నేపథ్యంలో మౌలిక సామాజిక మార్పులు అనివార్యమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరిగింది.
కానీ ఆ తిరుగుబాటు విఫలమై తమ పన్నాగం ఫలించకపోవడం తో సనాతన బ్రాహ్మణవాదులు ఓ మెట్టుదిగక తప్పలేదు. ఆధునిక కాలం తెచ్చిన మార్పుల్ని పూర్తిగా అడ్డుకో లేమని గ్రహించిన కొంత మంది లిబరల్ బ్రాహ్మణవాదులు, డిఫెన్సు ఎత్తుగడలకు పాల్ప డ్డారు. బ్రాహ్మలు భూదేవుళ్ళుకాదు, వాళ్లను ధిక్కరించటం దైవధికా ర్కరం కాదని ధ్వజమెత్తిన ఫూలే బ్రాహ్మణేతర వాదాన్ని ఎదుర్కోలేక ఆత్మరక్షణలో పడిన మనువాద బ్రాహ్మణులు ఆత్మరక్షణా చర్యలకి పాల్పడ్డారు. బ్రాహ్మడు దైవాంశ సంభూతుడేగాని దైవ సమానుడు కాదని, దేవుడు కాదని, అసలు దేవుడు బ్రహ్మ దేవుడని నచ్చజెప్పడా నికి తిలక్ ‘బ్రహ్మసమాజ్’ను స్థాపించాడు. వేదకాలం నాటి వైదిక ఆర్యుల్లో అసలు వర్ణధర్మంలేదు, మనుధర్మం లేదు, అస్పృశ్యత లేదు, అది బ్రాహ్మణసమాజ్‌కాదు- అని నచ్చచెప్పటానికి దాయానం ద ‘ఆర్యసమాజ్’ను స్థాపించారు. ఈ రెండూ దగాకోరు వాదాలేనని ఫూలే స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ ఎదురుదెబ్బ తీయడంతో ఈ డిఫెన్స్‌ఎత్తుగడలు రక్షించలేవని నిర్ధారణకు వచ్చినాక ప్రయో గించిన బ్రహ్మస్త్రమే హిందూత్వ.
అయితే ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ కట్జూ వ్యాఖ్యానించినట్లు 1857 నాటి తిరుగుబాటు ను ఎదుర్కొనడానికి తిరుగుబాటుదారుల మధ్య నెలకొన్న మత సామరస్య జాతీయ ఐక్యతను దెబ్బతీయడా నికి విభజించిపాలించే విధానంతో బ్రిటిష్‌వారే మత విద్వేష చిచ్చు రేపి మతతత్వానికి నాంది పలికారన్న పరాప రాధం నిజమే కానీ- అది ఎంత నిజమో, మతధర్మ రక్షణ ముసుగులో మనుధర్మ రక్షణ కోసం బ్రాహ్మణీయ అగ్రవర్ణ పాలకవర్గ శక్తులు కూడా అదేపని చేశాయన్న స్వయం కృతాపరాధంకూడా అంతే నిజం. అలాగే వైదికార్య సనాతన వలసవాదులకి, అధునా తన బ్రిటిష్ వలసవాదులకి విభజించి పాలించడం వెన్నతోపెట్టిన విద్య- అనేది కూడా అలాంటి నిజమే. హిందూత్వ అనుసరించే, విభజించి పాలించే విధానం బ్రిటిష్ వలసవాదుల నుండి అరువు తెచ్చుకున్నది కాదు. బ్రిటిష్ వారు దాన్ని ఒక విధానం (పాలసీ)గా మాత్రమే ఇండి యాలో అమలు జరిపారు.
కాని అంతకుముందే ప్రాచీనకాలంలో సంచార జాతిగా ఇండియాకి వలసవచ్చిన వైదికార్య శ్వేతజాతి ఈ దేశ మూలవాసుల్ని ఆనాడే విభజించి పాలించింది. ఈ కుటిలోపా యాన్ని ఒక విధానంగా అమలు చేయటం మాత్రమే కాకుండా, ఆ విధానాన్ని అన్వయించటానికి ‘బ్రాహ్మణీయ నిచ్చనమెట్ల సమాజం’ (ఎ సిస్టమ్‌ఆఫ్ బ్రాహ్మణికల్ గేడెడ్ సోషల్‌ఆర్డర్)గా దాన్ని నిర్మిం చింది. ఆ ‘కుల కవచ కుండలమే’ భేదోపాయ బ్రాహ్మణిజం. అందు వల్ల ఈ దేశంలో మతధర్మానికి వర్ణాశ్రమ మనుధర్మాన్ని అదనపు ప్రత్యేక ధర్మంగా, అదనపు ప్రత్యేక రక్షణకవచం (డాలు)గా మలచా రు. ఈ దేశానికి పరిమితమైన ఈ కుచ్చితమైన సామాజిక పరిమితి వల్ల, ఈ మతానికి ఆధ్యాత్మిక మతధర్మంతోపాటు సార్వజనీన స్వభావంలేని ప్రాదేశిక, సంకుచిత మనుధర్మం తోడైంది. ఈ దేశ రాజ్యానికికూడా మనుధర్మ రాజ్యస్వభావం సంక్రమించింది. ఈ దేశపాలకులకు, పాలనకు ఈ స్వయంనియంత్రిత వర్ణాశ్రమ (మను)ధర్మం ఎంతగానో తోడ్పడిందని, అందువల్ల ఆధునిక యుగంలోసైతం దీన్ని పరిరక్షించడం అవసరమని, అంతగా అయి తే అస్పృశ్యులను కూడా హిందూ హరిజనులుగా గుర్తిస్తామని డాబి.ఆర్.అంబేడ్కర్‌తో ఆనాడు మహాత్మాగాంధీ వాదించిన విషయం గమనార్హం.
ప్రాచీన యుగాంతంలో దాస శూద్ర బానిసలు తమ దాస్య శృంఖలాలను తెంచుకోవడం కోసం బౌద్ధం ఇచ్చిన భరోసాతో బహు జనులై తిరుగుబాటు చేస్తే, ఆనాడు అగ్రవర్ణాల ద్విజులకు మైనారిటీ అభద్రతాభావం ఏర్పడి అపాయంలో పడ్డారు. ఈ స్థితిని మార్చుకో వడం కోసం శూద్రవర్ణ బహుజనుల్ని రెండుగా విభజించి, అందులో మెజారిటీ శూద్రులకు ద్విజులతో సమానంగా సవర్ణ, స్పృశ్య సామా జిక హోదా కల్పించి తమవైపు తిప్పుకొన్నారు. మైనారిటీ అతి శూద్రులకి, అస్పృశ్య, అవర్ణ ముద్రవేసి అసమానులుగా వారిని ఊరునుండి, శూద్రులనుండి వేరుచేసి, ఏకాకుల్ని చేశారు. సవర్ణ- అవర్ణ, స్పృశ్య- అస్పృశ్య కుల ప్రాతిపదికపై మధ్యయుగాలనాటి సమాజాన్ని రెండు సామాజిక వర్గాలుగా విభజించి పాలించారు. ఇలా మెజారిటీ శూద్రులని విడగొట్టి పాలించే (డివైడ్ అండ్ రూల్) బ్రాహ్మణికల్ పాలసీకి విరుగుడుగా- కూడగట్టిపాలించే (యునైట్ అండ్ రూల్) నాన్‌బ్రాహ్మణికల్ ప్రత్యామ్నాయ పాలసీతో ఆధునిక యుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే శూద్ర, అతిశూ ద్రులను బహుజనులుగా సంఘటితంచేసి ప్రాచీనకాల బౌద్ధ బహుజనవాదాన్ని ఆధునిక దశకు అన్వయించి ఈ దేశ సామాజిక విప్లవ దశాదిశలను నిర్దేశించిన విషయం గమనార్హం.
ఈ దేశీయ ప్రత్యామ్నాయాన్ని దెబ్బతీసి ఆధునిక యుగంలో సైతం, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని రక్షించుకొనేందుకు జాతీయతత్వం ముసుగులో ఆధునిక మనువాద హిందూత్వను సృష్టించారు. స్వపర మతవిద్వే షాల్ని రెచ్చగొట్టి దేశ ప్రజలను మతపర మైన రెండు సామాజిక వర్గాలుగా విభజించిపాలించే పథకం పన్నారు. వాస్తవానికి పరమత అసహనంతో ఇతరమతాల అస్తిత్వాలను సహించలేని ఈ హిందూ త్వ ఫాసిజం కేవలం ఫాసిజం మాత్రమే కాదు, వాటి అస్థిత్వాలను కబళించే అంతర్గత వలసవాదం.
ఈ హిందూత్వ ఫాసిస్టుదాడుల అసలులక్ష్యం జాతీయ మతధర్మ రక్షణ ముసుగులో మను ధర్మరక్షణే గనుక దీనికి పరిష్కారం మతో న్మాద, మతతత్వ పరిష్కారాల పరిధిలో లభించదు.హిందూత్వ ఫాసిజంలో మతోన్మా దం, మతతత్వం కూడా మిళితమై ఉన్నా మూలకారణం మాత్రం బ్రాహ్మణిజాన్ని రక్షించే మనుధర్మరక్షణే. కనుక దీనికి పరిష్కారం- ఈ పరిధినఇధిగమించే మనుధర్మేతర, బ్రాహ్మణేతర, బహుళ బహు జన లౌకిక, సామాజిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ అవగాహన పరిధిలోనే లభిస్తుంది. 156 ఏళ్ళక్రితమే ఈ పరిష్కారాన్ని దేశ ప్రజ ల ముందుంచిన ఆధునిక నవభారత దశాదిశ నిర్దేశక మార్గదర్శి మహాత్మఫూలే చూపిన మార్గంతప్ప మరో మార్గాంతరం లేదు.
No comments:
Post a Comment